మేము వచ్చేస్తున్నాం అంటున్నాడు!!

Update: 2017-04-24 10:00 GMT

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చి అంచనాలు రెట్టింపైయ్యాయి. ఈ 'స్పైడర్' చిత్రం అటు తమిళం ఇటు తెలుగులో ఏకకాలంలో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ ఈ మధ్యనే సైలెంట్ గా విడుదల చేశారు. ఇక ఇప్పుడు 'స్పైడర్' చిత్రాన్ని జూన్ 23 న రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్... విజువల్ వర్క్ పూర్తి కానందున పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే మహెష్ తన చిత్రాన్ని జూన్ 23 నుండి పోస్ట్ పోన్ చేసాడో లేదో 'డీజే' బన్నీ తన చిత్రాన్ని జూన్ 23 న బరిలోకి దింపుతున్నాడు. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రాన్ని జూన్ 23 న విడుదల చేస్తున్నట్లు ఆఫీసియల్ అనౌన్సమెంట్ చేశారు. ఇక మహేష్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అర్ధం కాక మహేష్ ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు.

అయితే ఇప్పుడు మహేష్ - మురుగదాస్ చిత్రానికి ఆగష్టు 25 విడుదల డేట్ లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి మురుగదాస్ 'స్పైడర్' కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తి చేసి ఆగష్టు 25 కల్లా చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నద్ధం అవుతున్నాడట. 'స్పైడర్' చిత్రంలో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా రకుల్ డాక్టర్ గా నటిస్తుంది. ఇక తమిళ హీరో భరత్ ఒక ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడు.

Similar News