మెహ్రీన్ హిట్ హీరోతో చేసే ఛాన్స్ కొట్టేసింది

Update: 2018-03-24 05:52 GMT

వరసగా రెండు ప్లాప్స్ వచ్చినా మెహ్రీన్ కు టాలీవుడ్ నుండి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తొలిసారిగా ద్విభాషా చిత్రం చేస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఈ బ్యూటీ. అయితే లేటెస్ట్ గా మరో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

ఛలో సినిమాతో మంచి ఊపు మీద ఉన్న నాగ శౌర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది మెహ్రీన్. ఈ సినిమాకు 'నర్తనశాల' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఛలో సినిమాతో కొత్త దర్శకుడు వెంకీని పరిచయం చేసిన నాగ శౌర్య.. ఈసారి కూడా ఈ సినిమా ద్వారా చక్రవర్తి అనే మరో కొత్త డైరెక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు.

నాగశౌర్య-మెహ్రీన్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. ఏప్రిల్ 12నుంచి ఈ సినిమా సెట్స్ కి రానుంది. కేరాఫ్ సూర్య, జవాన్ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మెహ్రీన్ కు ఇంకా సినిమా ఛాన్స్ అవకాశం లేదని అందరు అనుకున్నారు. అదృష్టం బాగుందేమో వరసగా రెండు మీడియం రేంజ్ సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలే కాదు అమ్మడు ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నాయి వాటి గురించి త్వరలోనే ఎనౌన్స్ చేయనుంది.

Similar News