మెర్సల్ తో హ్యాట్రిక్ కొట్టారు

Update: 2017-11-02 07:00 GMT

విజయ్ 'మెర్సల్' చిత్రం కోలీవుడ్‌లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు విజయ్ సరసన నటించి ఈ చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇక విషయంలోకి వస్తే విజయ్ తో మూడు సినిమాలు చేసిన హీరోయిన్లుగా మెర్సల్ తో అరుదైన గౌరవం అందుకున్నారు సమంత మరియు కాజల్. విజయ్ సరసన నిత్యామీనన్ మొదటిసారి నటించగా కాజల్-సమంత ఇద్దరికీ ఇళయదళపతితో ఇది మూడో సినిమా కావడం విశేషం. విజయ్-కాజల్ కలయికలో అంతకుముందు 'తుపాకి', 'జిల్లా' చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అలాగే విజయ్-సమంత కాంబినేషన్‌లో గతంలో 'కత్తి', 'తేరి' చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలు రెండు కూడా సక్సెస్ఫుల్ చిత్రాలుగానే నిలబడ్డాయి. ఇక మెర్సల్ తో హ్యాట్రిక్ అందుకున్నారు ఈ భామలు.

Similar News