మెరుపుతీగలా మారుతున్న బొద్దు భామ

Update: 2016-11-15 11:30 GMT

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సక్సెఫుల్ చిత్రం ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐయ్యింది రాశి ఖన్నా. చూడటానికి బొద్దుగా వున్నా తెలుగు సినిమా ప్రేక్షకులు రాశి ఖన్నా ని బాగా ఆదరించారు. రాశి అనతి కాలంలోనే గోపి చంద్, రవి తేజ వంటి హీరోల చిత్రాలలో అవకాశాలు అంది పుచ్చుకోవటమే ఇందుకు నిదర్శనం. ఏ కథానాయిక అయినా ప్రస్తుత పరిశ్రమలో అగ్ర తారల జాబితాలో నిలవాలంటే శరీరాకృతి పై శ్రద్ద పెట్టక తప్పదు. నయనతార వంటి నాయికలు కూడా ఎంతో కష్టపడి తగ్గినవారే.

ఇప్పుడు ఎక్కువగా యువ కథానాయకులతో పనిచేసే అవకాశాలు వస్తుండటంతో రాశి ఖన్నా సన్నపడే ప్రయత్నాలలో కొంత కాలంగా శ్రమిస్తోంది. ఆ ఫలితం తాజాగా రామ్ సరసన నటించిన హైపర్ చిత్రంతో కొంత కనపడింది. ఇప్పటికీ రోజూ క్రమం తప్పకుండ వ్యాయామాలు చేస్తుందంట రాశి. చిత్రీకరణలు లేనప్పుడు అమ్మడికి రోజులో సగ భాగం వర్క్ ఔట్స్ లో గడిచిపోతుంది అంట. బాగా వర్క్ అవుట్ చేసి ఒంటినిండా చెమటలతో నిండి వున్న రాశి ఖన్నా సెల్ఫీ దిగి తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసి తన కష్టం గురించి అభిమానులతో పంచుకుంది. బొద్దుగా ఉండటం వలెనే రాశి ఖన్నాను ఇష్టపడ్డ ప్రేక్షకులు కూడా వున్నారు. మరి రానున్న చిత్రాలలో రాశి ని చూసి వారు ఆశ్చర్య పోతారేమో..

Similar News