మెగాస్టార్ ని బీట్ చేసిన పవర్ స్టార్

Update: 2017-02-25 07:39 GMT

మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ చిత్రం కోసం మెగా అభిమానులు అప్పుడు ఇప్పుడు అంటూ దాదాపు రెండున్నర్ర సంవత్సరాలు ఎదురు చూసారు. ఖైదీ నెం.150 ఖరారై ఆ చిత్ర టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేసిన నాటికి మెగా అభిమానుల నిరీక్షణ తార స్థాయికి చేరుకోవటంతో ఆ టీజర్ కి అనూహ్యమైన స్పందన దక్కి అప్పటికి టాలీవుడ్ టీజర్స్ కి వ్యూస్ పరంగా వున్న ఆన్లైన్ రికార్డ్స్ అన్నిటిని తుడిచిపెట్టేసింది. ఖైదీ నెం.150 చిత్ర టీజర్ నేటి వరకు 77 లక్షల 40 వేల పైచిలుకు వ్యూస్ దక్కించుకుంది. అయితే ఇటీవల విడుదల ఐన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు టీజర్ ఇప్పటికే చిరంజీవి ఆన్లైన్ రికార్డ్స్ ని అధిగమించేసి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.

కాటమరాయుడు టీజర్ ని ఇప్పటివరకు యూట్యూబ్ లో 77 లక్షల 63 వేల కిపైగా నెటిజన్లు వీక్షించారు. కాటమరాయుడు ట్రైలర్ విడుదల అయ్యే వరకు టీజర్ వ్యూస్ రోజు రోజుకి పెరిగే అవకాశం వుంది. ఖైదీ నెం.150 సినిమా విడుదలై బిజినెస్ కూడా దాదాపు ముగిసిపోవటంతో ఇక టీజర్ కి వీక్షకులు పెరిగే అవకాశం ఏ మాత్రం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు టీజర్ మెగా స్టార్ ఖైదీ నెం.150 మీద పైచేయి సాధించేసింది. దానితో అభిమానుల్లో ఇప్పుడు కాటమరాయుడు విడుదల అనంతరం సృష్టించబోయే సంచలనం పై ఆసక్తి నెలకొంది. తొమ్మిది సంవత్సారాల అనంతరం మేకప్ వేసుకుని 100 కోట్ల షేర్ ని సునాయాసంగా కొల్లగొట్టిన అన్నయ్య రికార్డ్స్ ని కాటమరాయుడు బ్రేక్ చేస్తాడో లేదో ఇప్పటికైతే సస్పెన్సే.

Similar News