మెగా హీరోల కాంపిటీషన్ మాములుగా లేదు!!

Update: 2018-02-16 12:00 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా హీరోస్ అయినా రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి మధ్య ఎప్పటికప్పుడు చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. అలాగే వీరిద్దరి ఫాన్స్ మధ్య కూడా చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే 2017 లో రామ్ చరణ్ ఎలాంటి సినిమా ని రిలీజ్ చెయ్యకపోవడం తో మెగా అభిమానులు చరణ్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అని ఎదురుచూస్తున్నారు. మరి ఏడాది రామ్ చరణ్ రంగస్థలంతో ప్రేక్షకులను కొత్త స్టైల్ లో ఆకట్టుకోబోతున్నాడు. మార్చ్ లో రంగస్థలం చిత్రం తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన రంగస్థలం టీజర్స్, సాంగ్ కూడా మెగా అభిమానులకే కాదు ప్రకృతి ప్రేమికులకు అమితంగా నచ్చేసింది. ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

బన్నీ కూడా....

ఇక గత ఏడాది డీజే తో హిట్ కొట్టిన బన్నీ ఈ ఏడాది ఏప్రిల్ లో నా పేరు సూర్య చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఏళ్లుగా అర్జున్ కూడా నా పేరు సూర్య సినిమా లోని లుక్ తోనూ అలాగే ఫస్ట్ ఇంఫాక్ట్ తోనూ వాలంటైన్స్ డే రోజు వదిలిన సాంగ్ తోనూ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. మరి మెగా హీరోలైన చరణ్, అల్లు అర్జున్ మధ్య మంచి కాంపిటీషన్ మొదలైపోయింది.మరి బావాబావమరుదులు ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మెగా అభిమానులను సైతం పిచ్చెక్కిస్తున్నారు.

అల్లు వారబ్బాయి బీట్ చేశాడా?

ఇకపోతే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ రంగస్థలం చిత్ర నైజాం ధియేటర్ రైట్స్ 18 కోట్ల కు అమ్ముడు పోగా , బన్నీ చిత్రం నా పేరు సూర్య నైజాం ధియేటర్ రైట్స్ 21.5 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇలా అల్లు అర్జున్, రామ్ చరణ్ ని బీట్ చేసాడు.మరి ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని బద్దలు చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

Similar News