మెగా హీరో అని ఒప్పుకోవటానికి మన దేశం పిల్ల కాదుగా

Update: 2017-03-04 10:35 GMT

సినిమా రంగంలో ఆన్ స్క్రీన్ మెరిసే జంటలకు కచ్చితంగా ఒకసారి కాకపోతే మరొకసారి రిలేషన్ లింక్స్ మీదకి చుట్టుకోవటం ఖాయం. ఇప్పుడు మెగా ఫామిలీ లో యంగ్ స్టార్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి ఈ పరిస్థితి తరచుగా ఎదురవుతోంది. ఇప్పటికే పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలలో తనకి జంటగా నటించిన కథానాయిక రెజినా తో నక్షత్రం చిత్రంలోనూ కలిసి పని చేయటంతో సాయి ధరమ్ తేజ్ కి రెజినా మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వినిపించాయి. ఇక విన్నర్ చిత్రీకరణ ప్రారంభం ఐన నాటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తో సాయి ధరమ్ తేజ్ రాసుకు పూసుకు తిరుగుతున్నాడని విన్నర్ చిత్రం పూర్తయ్యే సరికి వీరి మధ్య బంధం బాగా బలపడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే ప్రస్తావన సాయి ధరమ్ తేజ్ దగ్గర తీసుకురాగా రెజినా మరియు రకుల్ ప్రీత్ సింగ్ లకి తనకి మధ్యన వున్నది కేవలం స్నేహ బంధమేనని, వారిద్దరితో నటించటం చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పిన సుప్రీమ్ హీరో వీరెవరికీ తాను ప్రొపొసె చెయ్యనే లేదని కానీ తిక్క సినిమా జరుగుతున్న సమయంలో ఆ సినిమాలో నటించిన బ్రెజిల్ దేశానికి చెందిన కథానాయిక లారిస్సా బొనెసి ని ప్రేమించానని, అయితే ఆ భామ తన ప్రేమని తిరస్కరించిందని చెప్పి వాపోయాడు సాయి ధరమ్ తేజ్. అదే మన దేశానికి చెందిన భామలు అయితే మెగా హీరో కాబట్టి ఒప్పుకునే వారేమో కానీ బ్రెజిల్ దేశస్థురాలికి మెగా ఫామిలీ అనేది ఒక క్వాలిఫికేషన్ గా కనిపించదు కదా పాపం. ఇప్పటికైనా విదేశీ భామలపై కాకుండా స్వదేశీ భామలతో ప్రేమలో పడితే తేజు కి ఏమైనా ఉపయోగం ఉంటుంది.

Similar News