మెగా సెల్ఫీ ఆకట్టుకుంటుంది

Update: 2017-11-13 10:00 GMT

మెగా ఫ్యామిలీ నుండి దూసుకొచ్చిన మరో యువ కెరటం నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. కెరీర్ లో విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న వరుణ్ ఈ మద్యనే ఫిదా వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇకపోతే నాగబాబు కూడా ఒకప్పుడు వెండితెర మీద ఇప్పుడు బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు. అలాగే నాగబాబు కూతురు బుల్లితెర మీద యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. ఇలా వారి ఫ్యామిలిలో ముగ్గురూ సినిమా ఇండస్ట్రీ తో సంబంధం ఉన్నవారే. ఇకపోతే నాగబాబు భార్య కూడా తన కూతురు కి కావాల్సిన డ్రెస్ సెలెక్షన్స్ లో కీలక పాత్ర పోషిస్తుందని నిహారిక ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇలా ఎప్పుడూ బిజిగా ఉండే ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యింది.

వరుణ్ తేజ్ ఎప్పుడూ షూటింగ్స్ తో విదేశాల్లో గడిపేస్తూ ఇలా టైం దొరికినప్పుడు కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక వరుణ్ తేజ్, నాగ బాబు, నాగబాబు భార్య, నిహారికలు నిన్న ఆదివారం ఒక రెస్టారెంట్ కి లంచ్ చెయ్యడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ సెల్ఫీ ఒకటి తీసి వరుణ్ తేజ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ఈ పిక్ లో నాగబాబు ఆయన సతీమణి, వరుణ్ తేజ్, నిహారికలు అందరూ నవ్వుతూ ఫోజులిచ్చారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తీసిన ఈ మెగా సెల్ఫీ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

మెగా ఫాన్స్ అయితే తమ అభిమాన హీరో ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడాన్ని మాత్రం తెగ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇకపోతే నాగబాబు ఈ టీవీ లో జబర్దస్త్ షోతో బిజీగా ఉండగా... నిహారిక, సుమంత్ అశ్విన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. అలాగే వరుణ్ తేజ్ కూడా వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాశి ఖన్నా తో కలిసి తొలిప్రేమ సినిమాలో నటిస్తున్నాడు.

Similar News