మెగా ప్రొడ్యూసర్ కి ఎన్ని తెలివితేటలూ!

Update: 2016-08-26 04:57 GMT

చిరు తన 150 వ సినిమా ఎప్పుడు చేస్తాడా అని మీడియా ఎప్పటికప్పుడు హోరెత్తించింది. ఇక 150 సినిమా మొదలయ్యాక ఆ సినిమా గురించి అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరవేసింది. మరి మీడియా పుణ్యమా అని చిరు 150 వ సినిమాకి అనుకున్నంత పబ్లిసిటీ వచ్చిందనేగా దానర్ధం. మరి అలాంటి మీడియా ని చిరంజీవి తన పుట్టిన రోజున అవమానించాడని వార్తలొచ్చాయి. చిరు తన బర్త్ డే స్పెషల్ గా ఇండస్ట్రీ లోని కొంతమంది ప్రముఖులకు పర్సనల్ గా పార్క్ హయ్యత్ లో పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి మీడియా ని మెయిన్ గేట్ వరకే ఎలౌ చేశారని... పూర్తి ప్రవేశాన్ని కలిపించలేదని మీడియా లో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల గురుంచి రామ్ చరణ్ కూడా విన్నాడట. మరి చిరు 150 వ సినిమా ఇంకా సగం కూడా కంప్లీట్ కాలేదు ఇప్పుడు మీడియా అలిగితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నాడేమో ఈ మెగా ప్రొడ్యూసర్. అందుకే త్వరగా స్పందించి అప్పటికప్పుడు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసాడట. ఇలా జరగడం బాధగా ఉందని కావాలని ఇలా చెయ్యలేదని... ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావని ప్రెస్ నోటిలో చెప్పాడట. అబ్బో రామ్ చరణ్ చాల తెలివిగా ఈ నోట్ విడుదల చేసాడు. ప్రొడ్యూసర్ గా ఈ మాత్రం తెలివితేలా ఉండక పొతే కష్టమే కదా.మీడియా ని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు..... చూస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి నఅనడానికి ఇదో ఉదాహరణ.

Similar News