మూడు సంవత్సరాల పాటు బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేసిందట

Update: 2017-02-23 04:39 GMT

బాలీవుడ్ లో హౌస్ ఫుల్ చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని సల్మాన్ ఖాన్ సరసన కిక్ చిత్రంలో కథానాయికగా అవకాశం సంపాదించుకున్న శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ప్రతి సంవత్సరం కనీసం రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఏకార్డింగ్ టు మ్యాతీవ్ అనే ఆంగ్ల చిత్రంతో పాటు ఈ ఏడాది ఆగష్టు నెలలో విడుదల కానున్న రీ లోడెడ్ మరియు సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న జుద్వా 2 చిత్రంలో నటిస్తుంది. జుద్వా 2 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తుండగా వారిలో ఒకరు జాక్వెలైన్ ఫెర్నాండేజ్ కాగా, మరో కథానాయిక తాప్సి పన్ను. రీ లోడెడ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశకి చేరుకోవటంతో జాక్వెలైన్ ఇంటర్వ్యూ లు ఇవ్వటం మొదలు పెట్టేసింది.

తాజాగా జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ముద్దు సన్నివేశాల గురించి ప్రస్తావన రాగా సినిమా లో వుండే సన్నివేశాలతో పాటు తన వ్యక్తిగత ముద్దు సన్నివేశం గురించి కూడా బైట పెట్టేసింది ఈ శ్రీలంక బ్యూటీ. "నా స్కూల్ డేస్ లోనే నా తొలి ముద్దు అనుభవం అయిపోయింది. నాకు స్కూల్ డేస్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. మూడు సంవత్సరాల పాటు అతనితో నా ప్రేమ కథ నడిచింది. అతనితో నా 14 వ సంవత్సరంలోనే నేను నా తొలి లిప్ లాక్ అనుభవం పొందాను. ఆ తరువాత నేను ప్రేమ కి, కుర్రాలకి దూరంగా ఉంటున్నాను." అంటూ ధైర్యంగా తన స్కూల్ డేస్ లిప్ లాక్ ఎపిసోడ్ గురించి మనసు విప్పింది జాక్వెలైన్ ఫెర్నాండేజ్.

Similar News