మూడు పరాభవాలతో హోంలీ పాత్రలకు దూరం

Update: 2016-11-28 04:47 GMT

అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో ముకుంద చిత్రం ద్వారా వెండితెరకు నూతన నాయక నాయికలు పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఆశించిన phalithaanni ఇవ్వలేకపోయింది. కానీ కథానాయకుడిగా పరిచయమైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కంచె చిత్రంతో విజయం అందుకోవటమే కాకుండా నటుడిగానూ తనని తాను నిరూపించుకున్నారు. ముకుంద లో కథానాయికగా పరిచయం ఐన పూజ హెగ్డే ఒక లైలా కోసం చిత్రంలో అక్కినేని నాగ చైతన్య సరసన నటించే అవకాశం అయితే దక్కించుకుంది కానీ కొత్త తరహా పాత్ర అయితే ప్రయత్నం చేసే అవకాశం దొరకలేదు. ఒక లైలా కోసం లోనూ ముకుంద లో చేసిన హోంలీ పాత్రనే పోషించింది. కాగా ఆ చిత్రం కూడా నిరాశ పరిచింది.

ఒక లైలా కోసం నిరాశపరిచినా, ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకున్నట్టు పూజ హెగ్డే కి బాలీవుడ్లో హ్రితిక్ రోషన్ సరసన మోహెన్జదారో చిత్రంలో నటించే సదావకాశం రావటంతో పూజ హెగ్డే ఇక ఇప్పట్లో దక్షిణ సినిమాల వైపు కన్నెత్తి చూడదు అనుకున్నారు అంతా. బాలీవుడ్లోనూ ఇక్కడి తరహా పాత్రే దొరకటం, ఆ చిత్రం కూడా ఘోర పరాభవం చవి చూడటంతో పూజ హెగ్డే కు మళ్లీ టాలీవుడే దిక్కు ఐయ్యింది. ఫుల్ ఫామ్ లో వున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటిస్తుంది. పైగా ఇప్పటివరకు పూజ హెగ్డే పోషంచని గ్లామర్ బబ్లీ పాత్ర పోషిస్తుండటం విశేషం.

శృతి హాసన్ కూడా తొలుత వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ అపజయాలు మూటకట్టుకుంటున్న సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ తనకు గబ్బర్ సింగ్ తో భారీ విజయాన్ని అందించి టాప్ హీరోయిన్ జాబితాలో నిలబెట్టాడు. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం తో పూజ హెగ్డే కు కూడా ఆ హోదా కలిపించాలని తెగ కృషి చేస్తున్నాడు హరీష్ శంకర్.

Similar News