ముంబై కన్నా తెలుగు పరిశ్రమే సుఖం అంట

Update: 2016-11-17 11:34 GMT

ఆలా ఎలా వంటి చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐన హెబ్బా పటేల్ కి ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ రిమోట్ ప్రాంతాలలో కూడా గుర్తింపు తెచ్చిన చిత్రం సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్. ఆ చిత్రం విజయం తరువాత కొంచం ఆలస్యంగా నైనా హెబ్బా పటేల్ బిజీ అయిపోయింది. కుమారి 21 ఎఫ్ లో తన కో ఆర్టిస్ట్ ఐన రాజ్ తరుణ్ సరసన ఈడో రకం వాడో రకం లో మెరిసి ప్రేక్షకులను మరో సారి ఆకట్టుకుంది హెబ్బా పటేల్. ఈ శుక్రవారం హెబ్బా పటేల్ నిఖిల్ జంటగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుట్టి పెరిగింది ఉత్తరాదిన అయినప్పటికీ హెబ్బాకు తెలుగు పరిశ్రమ బాగా నచ్చేసింది అంట. ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న హెబ్బా తెలుగు పరిశ్రమలో పోటీ వాతావరనమ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, "బాలీవుడ్ కన్నా ఇక్కడే ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం వుండే అవకాశం ఎక్కువ వుంది. వరుస చిత్రాలు చేస్తున్నా ఇక్కడ పని తీరు వల్ల నటులకు ఎలాంటి వత్తిడి ఎదురు కాదు. నేను తెలుగు, కన్నడ, తమిళ భాషలలో దాదాపు నెల వ్యవధిలోనే పరిచయం అయ్యాను. దానితో నాకు ఒకేసారి విజయాపజయాలు చవి చూసే అదృష్టం దక్కింది. ఎప్పటికి నన్ను ఆదరించిన తెలుగు పరిశ్రమలో అవకాశాలు వదులుకోను." అని మనసులో మాట పంచుకుంది హెబ్బా పటేల్.

హెబ్బా పటేల్ నటిస్తున్న రెండు చిత్రాలు నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్, అందగాడు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి.

Similar News