మిస్టర్ మంచి క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు!!

Update: 2017-03-23 04:12 GMT

'ఆగడు, బ్రుస్ లీ' చిత్రాల ఘోర పరాజయంతో శ్రీను వైట్ల కష్టాల సుడిగుండంలో పడిపోయాడు. ఇక వైట్ల పని అయిపోయిది అనుకుంటున్న సమయంలో మెగా హీరోతో మరొక అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మిస్టర్ మూవీలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ బుధవారం ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు.

మిస్టర్ లో వరుణ్ తేజ్ సూపర్ క్లాస్ లుక్ లో కనిపించనున్నాడు . ఇక హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలాగా మోడరన్ లుక్ లో ఈ ట్రైలర్ లో దర్శనమిచ్చింది. లావణ్య త్రిపాఠి అయితే పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనబడుతుంది. ఈ చిత్ర ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ బావున్నాయి. కామెడీ, ఎమోషన్స్, ప్రేమ, పగ, యాక్షన్ సీన్స్ కి తక్కువ కాకుండా ఉన్న ఈ ట్రైలర్ అందరూ ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు.

ఇక శీను వైట్ల కామెడీ ని నమ్ముకునే చాలా చిత్రాలు హిట్ కొట్టి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు. కానీ అదే కామెడీతో కొన్నిసార్లు ప్లాపులు కూడా చవిచూశాడు. మరి ఈ 'మిస్టర్' ట్రైలర్ చూస్తుంటే శ్రీను వైట్ల మరోమారు హిట్ ట్రాక్ ఎక్కుతాడనే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో....!!

Similar News