మాస్ డైరక్టర్ చేస్తున్నది మల్టీ స్టారరా?

Update: 2016-11-14 12:35 GMT

దర్శకుడిగా చేసిన ఆరు చిత్రాలలో ఐదు ఘన విజయాలు సాధించి మాస్ డైరెక్టర్ ఇమేజ్ ని, ఆ స్థానాన్ని వి.వి.వినాయక్ దగ్గర నుంచి లాగేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. సంచలనాలు సృష్టించిన విజయాలతోపాటు ఈ మధ్య కాలంలో వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బోయపాటి శ్రీను. తన సమకాలీన దర్శకుడు ఐన కొరటాల శివ సాంకేతిక నిపుణుల కష్టాన్ని, శ్రమని వాడుకుని వారికి గుర్తింపు ఇవ్వరు అని బోయపాటి శ్రీను పై బహిరంగంగానే ఆరోపించారు. కానీ ఇవేవి ఆయన భవిష్యత్ కార్యాచరణపై ప్రభావం చూపలేదు. ఆయన ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి ఇప్పుడు పని చేస్తున్నారు.

ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది చిత్ర బృందం. ఈ చిత్రం లో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు యువ కథానాయకులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇది మల్టీ స్టార్రర్ చిత్రం అని ఇప్పటి వరకు చిత్ర బృంద సభ్యులు అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం తమిళ నటుడు శరత్ కుమార్ ని తీసుకున్నారు. అయితే ప్రతినాయకుడి పాత్రకి ఇంకా ఎంపిక పూర్తి కాలేదు. ఆ పాత్ర కోసం హీరోలు శ్రీకాంత్, రాజశేఖర్ ల పేర్లను దర్శక నిర్మాతలు చర్చిస్తున్నారు.

Similar News