మహేష్ హీరోయిన్ కి టైం కలిసొచ్చేనా?

తెలుగులో మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ కి తెలుగులో తర్వాత అనుకున్న అవకాశాలు రాలేదు..అందుకే బాలీవుడ్ లోనే అవకాశాలు వెతుక్కుంటూ [more]

Update: 2020-08-05 11:20 GMT

తెలుగులో మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ కి తెలుగులో తర్వాత అనుకున్న అవకాశాలు రాలేదు..అందుకే బాలీవుడ్ లోనే అవకాశాలు వెతుక్కుంటూ అక్కడే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లోను ఓ అన్నంత ఫేమ్ లేకపోయినా.. హాట్ ఫొటోస్ తోనూ, సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ గర్ల్ ఫ్రెండ్ గ బాగానే ఫెమస్ అయ్యింది కృతి సనన్. అయితే తాజాగా కృతి సనన్ కో ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చింది అని.. అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదని అంటున్నారు. ఈ దెబ్బకి అమ్మడు బాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయమంటున్నారు.

బాలీవుడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హ్రితిక్ రోషన్ క్రిష్ 4 చిత్రంలో హీరోయిన్ గా నటించే చాన్స్ కృతి సనన్ కి వచ్చినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. క్రిష్ సీరీస్ అనగానే బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ వుంది. గతంలో ఈ సీరీస్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్.  ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే భారీగా తెరకెక్కనున్నఇప్పుడీ క్రిష్ 4లో హృతిక్ ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నట్టు చెబుతున్నారు. మరి ఇలాంటి సినిమా కోసం హీరోయిన్స్ గా ముందు కత్రినా కైఫ్, అలియా భట్ ల పేర్లు వినిపించినా చివరకి  ఆ అవకాశం మహేష్ భామ కృతి సనన్ ని వరించినట్టుగా టాక్ మాత్రమే కాదు.. ఇప్పటికే  కృతి సనన్ ఎంపిక, అగ్రిమెంట్ కూడా పూర్తయ్యాయని అంటున్నారు.

Tags:    

Similar News