మహేష్ సీఎం లుక్!!

Update: 2017-10-06 11:00 GMT

మురుగదాస్ దర్శకత్వంలో నటించిన స్పైడర్ తో బాగా దెబ్బతిన్న మహేష్ కొద్ది రోజులు ఇటలీ టూర్ కి వెళ్ళాడు. అక్కడ భార్య పిల్లలతో ఫ్రెష్ అప్ అయ్యాక తన తదుపరి చిత్రం భరత్ అనే నేను చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతాడు. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కొరటాల శివతో మహేష్ బాబు ఇప్పుడు భారత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్నాడు. మరి ఈ చిత్రంలో మహేష్ ఎన్నడూలేని విధంగా కొత్తగా ఒకరాష్ట్రానికి సీఎం స్థానంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నాడు.

రాజకీయంగా.....

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న భారత్ అనే నేను చిత్రం షూటింగ్ అప్పుడే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని అసెంబ్లీ సెట్ లో భారత్ అనే నేను సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇక ఈచిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గెటప్ ఎలా వుండబోతుందో అనే ఆశగా ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు ఇప్పుడు ఆ చిత్రంలోని మహేష్ లుక్ ఒకటి బయటికి రావడంతో దాన్ని చూసిన మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆ లుక్ లో మహేష్ సీఎం గా ఎలా ఉంటాడో అర్ధమైపోయింది.

అందంగా...స్టయిలిష్ గా.....

ఫార్మల్ డ్రస్సులో ఉన్న మహేష్ చూడడానికి ఏమంత కొత్తగా కనబడం లేదు. ఎప్పటిమాదిరిగానే చాలా అందంగా... స్టైలిష్ గా కనబడుతున్నాడు. మరి ఈ చిత్రంలో మహేష్ లుక్ చూస్తుంటే మాత్రం స్టైలిష్ సీఎం అనకుండా ఉండలేము. ఇక మహేష్ పక్కన ఉన్న సెక్యూరిటీ.... అలాగే మహేష్ వెనకాల సెక్రటరీ ఇలా సెటప్ అంతా చూస్తుంటే మాత్రం మహేష్ సీఎంగా వెలిగిపోతున్నట్లే కనబడుతున్నాడు. మరి ఒక ఏజ్ లో సీఎం లు అయితే వైట్ అండ్ వైట్ తోనో లేకుంటే పంచెకట్టు తోనో, లేకుంటే కుర్తా పైజామాతోనో కనబడతారు. మరి కుర్ర సీఎం లు అయితే ఇలా మహేష్ లాగే ఫార్మల్ డ్రస్సులో కనబడతారు కదా అంటున్నారు మహేష్ అభిమానులు.

Similar News