మహేష్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్ !!

Update: 2017-12-11 13:01 GMT

సినిమా ప్రేక్షకుల మధ్యకి రావాలంటే దాని వెనుక చాలా మంది పనిచేస్తారు. సినిమా బాగుండాలనే ఉద్దేశ్యంతో సాంకేతిక నిపుణులు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పని చేస్తూ వుంటారు. ముఖ్యంగా డైరెక్టర్ - సినిమాటోగ్రాఫర్ కి బాండింగ్ ఉంటేనే ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

డైరెక్టర్ తో విభేదాలతోనే....

అయితే మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రవి కే వర్మన్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ - సినిమాటోగ్రాఫర్ కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి అని అందుకే అతను సినిమా నుండి తప్పుకున్నట్టు తెల్సుతుంది.

డిలే అవుతుందా?

జనతా గ్యారేజ్ టైమ్ లో కూడా సినిమాటోగ్రాఫర్ మాథి తప్పుకుని.. అతని స్థానంలో తిరు వచ్చాడు. ఇఫ్పుడు భరత్ అనే నేను సినిమాకు కూడా రవి కే వర్మన్ ప్లేస్ లో తిరు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఇక్కడ నష్ట పోయేది డైరెక్టర్ కాదు ఇంకోరు కాదు. దీనివల్ల నిర్మాతకే సమస్య. ఒప్పుకున్న ప్రకారం ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపాలి. కొత్త వాళ్లకి మళ్లీ పేమెంట్ ఇవ్వాలి. భరత్ అనే నేను సమ్మర్ విడుదలకు రెడీ అవుతోంది. మరి ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ మారడం వల్ల ప్రాజెక్టు ఏమైనా డిలే అవుతుందేమో చూడాలి.

Similar News