మహేష్ ను మించి సాధిస్తున్న బావ

Update: 2016-10-02 09:38 GMT

సూపర్ స్టార్ క్రిష్ణ గారి నట వారసులు ఎందరు వచ్చినా, వస్తున్నా ప్రిన్స్ మహేష్ బాబు కి ఉండే అభిమాన బలంతో పోటీ పడలేరు. విజయాపజయాలు పరిగణకు తీసుకోకుండా పెద్ద నిర్మాణ సంస్థలు ఎప్పుడూ మహేష్ బాబు కాల్ షీట్స్ కోసం తాపత్రయపడుతూ ఉంటాయి. రమేష్ బాబు, సుధీర్ బాబు, మంజుల వంటి వారు క్రిష్ణ గారి వారసులుగా చిత్ర పరిశ్రమలో ప్రయత్నించినా అభిమానులు, ప్రేక్షకులు మాత్రం వారిని ఆశించిన స్థాయిలో ఆదరించలేదు.

సుధీర్ బాబు మాత్రం ఆ స్టార్ స్టేటస్ చక్రంలో ప్రవేశించే ప్రయత్నం చెయ్యకుండా తనకి గుర్తింపు తెచ్చే పాత్రలు అనుకుంటే సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా కూడా చేస్తూ తన పరిధిని విస్తరించుకోవటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా భాగి అనే హిందీ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించి ఉత్తర దేశం లోని సినిమా ప్రేక్షకులలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపే రాబోయే సుధీర్ బాబు చిత్రంతో మహేష్ బాబు చేయలేని గణత సాధించిపెడుతుంది. సుధీర్ బాబు ఎప్పటి నుంచో భారతీయ బాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపిచంద్ జీవిత కథలో నటించటానికి ఆశక్తి చూపుతున్నాడు. ఆ చిత్రం తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో చిత్రీకరించి తమిళంలోకి అనువదించాలి అని చిత్ర నిర్మాతలు ప్రణాళిక వేసుకున్నారు. కాగా భాగీ చిత్రంతో సుధీర్ బాబుకి వచ్చిన గుర్తింపు కారణంగా ఆ చిత్రాన్ని హిందీ భాషలో కూడా నిర్మించాలి అని యోచిస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాణం అనుకున్న ప్రణాళిక ప్రకారం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నిర్మితమై తమిళంలోకి అనువదించ పడితే క్రిష్ణ గారి వారసుల్లో ఆ అరుదైన గణత సాధించిన కీర్తి సుధీర్ బాబు కే చెందుతుంది. మహేష్ నటించిన శ్రీమంతుడు, బ్రహ్మోత్చవం చిత్రాలు తెలుగు లో నిర్మితమై తమిళ భాషలో మాత్రమే అనువదించ పడ్డాయి.

Similar News