మహేష్ గడ్డంలోనా ?

Update: 2018-02-08 21:30 GMT

ప్రిన్స్ మహేష్ బాబు అంటే మనకి ముందు గుర్తొచ్చేది అతని అందమైన మొహం, క్లీన్ షేవ్ తో ఎప్పుడు తెల తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు మహేష్ ఎప్పుడు గడ్డంతో మనకి కనిపించలేదు. ఒకవేళ కనిపించినా ట్రిమ్ చేసుకుని బయటికి వచ్చేవాడు. కానీ తన నెక్స్ట్ మూవీలో గడ్డంతో మహేష్ కనిపించనున్నాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య టాక్ నడుస్తుంది.

భరత్ అనే నేనులో మహేష్ కొన్ని సీన్స్ లో గడ్డంతో కనిపించనున్నాడట. డైరెక్టర్ కొరటాల శివ ఈ గెడ్డం సీన్స్ గురించి ప్రస్తావిస్తే .. ప్రిన్స్ ఎమోషనల్ గా తీసుకుని.. మారుమాట్లాడకుండా సెట్స్ నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. తీవ్ర తర్జనభజన తర్వాత.. కొరటాల ప్రపోజల్ కి మహేష్ కన్విన్స్ అయ్యాడని..... గడ్డంతో నటిస్తా కానీ ఒక షరతు అన్నదాత!

అయితే ఆ షరతు ఏమిటంటే.....పెంచిన గడ్డం కాకుండా పెట్టుడు గడ్డంతో చేస్తానని మహేష్ షరతు పెట్టారట! సినిమాలో మహేష్ గడ్డం చూసి ఒరిజినల్ అని పొరపడొద్దని అవతలి ఫ్యాన్స్ కామెంట్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి స్పైసి టాక్ ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగింది. ఇది ఆఫీసియల్ గా కన్ఫర్మేషన్ వచ్చేవరకు ఈ టాక్ ఇలానే కొనసాగుతూనే ఉంటుంది.

Similar News