మహేష్ కి నాకు సంబంధం లేదంటున్న హీరోయిన్!!

మహేష్ బాబు మహర్షి సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మహేష్ మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో [more]

Update: 2019-06-23 15:41 GMT

మహేష్ బాబు మహర్షి సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మహేష్ మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక చాలా కాలం తర్వాత మాజీ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ విజయ శాంతి సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం విజయశాంతి ఎప్పుడో చెప్పింది. అయితే ఈసినిమాలో విజయశాంతి మహేష్ తల్లిగా నటిస్తుందని ఒకసారి, కాదు నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనబడబోతుందని ఒకసారి ప్రచారం జరిగింది.

తాజాగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మట్లాడుతూ.. తాను సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించబోతుందో రివీల్ చేసింది. అయితే తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నానే విషయం నిజం కాదని.. ఈ సినిమాలో తనది ఓ ముఖ్యమైన కీలకపాత్ర మాత్రమే కానీ…. విలన్ రోల్ కాదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయనని చెప్పిన ఆమె…. మహేష్ కి తనకి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా ఉండదు అని సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తన పాత్రపై విజయ శాంతి క్లారిటీ ఇవ్వడంతో…ఆమె పాత్రపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

Tags:    

Similar News