మళ్ళీ రావా దర్శకుడి సుడి చూశారూ.

Update: 2017-12-10 11:06 GMT

మళ్లీ రావా అనే చిన్న సినిమా ఈ వారం విడుదల అయింది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. మళ్ళీ రావా సినిమాకి ప్రేక్షకులనుండే కాక క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ మార్కులే పడ్డాయి. అయితే మళ్ళీ రావా సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ దర్శకుడుకి ఓ సినిమాకు అడ్వాన్స్ అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాలు తీసే నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ కొత్త దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మళ్లీ రావా సినిమా టేకింగ్ ని చూసి శ్రీధర్ ఈ దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది. ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలోలాంటి సినిమాలకు యూత్ నుంచి కాస్త రెస్పాన్స్ బాగుండడంతో, అలాంటి సినిమాలకు పనికివస్తాడనే ఆలోచనతో మధుర శ్రీధర్ ఈ దర్శకుడిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

మళ్లీ రావా సినిమా రెస్పాన్స్ ఎలా వున్నా ఈ డైరెక్టర్ మేకింగ్ పై శ్రీధర్ కి పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ జరిగే అవకాశముంది. అయినా ఇప్పుడు ఇండస్ట్రీలో సరైన దర్శకుల కొరత చాలా వుంది. కాస్త సబ్జెక్ట్ అల్లగల సత్తా వున్న దర్శకులు దొరికితే లటక్కున పట్టేసుకుంటున్నారు నిర్మాతలు

Similar News