మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది!!

Update: 2017-06-21 08:00 GMT

'గోపాల గోపాల' చిత్రంలో వెంకటేష్ - పవన్ కళ్యాణ్ కలిసి మల్టి స్టారర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. వెంకటేష్ తో వున్న అనుబంధంతోనే పవన్ అప్పట్లో 'గోపాల గోపాల' లో గెస్ట్ రోల్ చేసాడు. అసలు వెంకటేష్ పవన్ కళ్యణ్ లు మంచి ఫ్రెండ్స్. వీరి కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్ట్ మూవీ వస్తే బావుంటుంది అనుకున్న టైంలోనే వీరిద్దరూ 'గోపాలా గోపాలా' లో కలిసి యాక్ట్ చేసి అభిమానులను అలరించారు. అయితే ఇప్పుడు మరోసారి పవన్, వెంకీ లు కలిసి కనబడబోతున్నారట.

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ చిత్రం ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. త్రివిక్రమ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఇలా వెంకీ ని గెస్ట్ రోల్ లోచేసేందుకు ఒప్పించాడట. అలాగే వెంకీ గెస్ట్ రోల్ ఈ చిత్రానికి కీలకం అంటున్నారు. ఇంకా మంచి ఎంటర్టైనింగ్ గా కూడా ఉండబోతుంది. ఇక వెంకీ... పవన్ చిత్రంలో నటిస్తున్నాడని విషయం ఇప్పటివరకు బయటికి పొక్కకుండా చాలా గోప్యంగా ఉంచిన టీమ్ ఈ రోజు వెంకటేష్ తో తెరకెక్కించిన సన్నివేశాలతో బహిర్గతమైందట.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితవమవుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఖుష్మూ, ఇంద్రజ, కీర్తి సురేష్, అను అమ్మన్యువల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు అంటే ఈ చిత్రంపై ఇంకెన్ని అంచనాలు పెరిగిపోతాయో అంటున్నారు.

Similar News