మళ్ళీ ఆ పని చేస్తున్నాడట!!

Update: 2017-07-12 05:15 GMT

పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా వస్తుంది అంటే ఆ క్రేజే వేరప్పా అంటారు. ఇక హీరోగా పవన్ నటనకే అంతఇదైపోయె ఫ్యాన్స్ పవన్ తన సినిమాలో గొంతు సవరిస్తున్నాడు అంటే ఊరుకుంటారా.. రెచ్చిపోయి పండగ చేసేసుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కథకు అనుగుణంగా తన సినిమాలు కొన్నిట్లో పాటలు కూడా పాడాడు. ‘ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది' సినిమాల్లో పవన్ పాటలు పాడి ఫ్యాన్స్ ని అలరించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాయబోతున్న సినిమాలో కూడా పవన్ ఒక పాట పడబోతున్నట్లు సమచారం అందుతుంది. పవన్ తాజా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈమేరకు ఒక స్టైలిష్ పాటను పవన్ కోసం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ - పవన్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇక పవన్ ఒక పాట పాడబోతున్నదంటూ బయటికి వచ్చిన వార్తతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఇక పవన్ తన సినిమాల్లో పాటలు పాడితే గనక ఆ సినిమాలు హిట్టవుతాయనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది కాబట్టే ఇప్పుడు ఈ సినిమాలో పవన్ పాట పాడుతుండడంతో పవన్ ఫ్యాన్స్ కి పట్టపగ్గాలు లేకుండా పోయాయంటున్నారు.

Similar News