మళ్ళీ అంతటి బ్లాక్ బస్టర్ ఆ దర్శకుడితోనే సాధ్యమా?

Update: 2017-10-05 09:00 GMT

గతంలో రాజమౌళి - ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సింహాద్రి బాక్సాఫీసుని దడదడ లాడించింది. ఆ దెబ్బకి ఎన్టీఆర్ స్టార్ హీరో అవతారమెత్తేసాడు. ఒక్కసారిగా క్రేజున్న హీరో అయ్యాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం, అమోఘం. అయితే సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేదే పడలేదు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ హిట్స్ ఉన్నపటికీ సింహాద్రి వంటి సూపర్ హిట్ మాత్రం ఆ సినిమాలు అందులేకపోయాయి. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చే సినిమాల్లోని కథలు, ఎంచుకునే దర్శకులు, ఇలా ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ మార్పు ఎన్టీఆర్ నుండి స్పష్టంగా కనబడుతుంది.

త్రివిక్రమ్ వల్ల సాధ్యమేనా?

అయితే ఎంతమార్పొచ్చినా సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఈసారి త్రివిక్రమ్ మాత్రమే ఎన్టీఆర్ కి అందించగలడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ ఎప్పటినుండో నటించాలనుకున్నాడు. అప్పటికల ఇప్పుడు అంటే వచ్చే మార్చి నుండి తీరబోతుంది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే చిత్రం వచ్చే ఏడాది మార్చి నుండి మొదలు కాబోతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ రికార్డులన్నీ బద్దాలు కొట్టేసి టాప్ రేంజ్ కి వెళ్లగలడనే ఆశతో ఉన్నారు ఫాన్స్. ఇక త్రివిక్రమ్ తో సినిమా మొదలెట్టేవరకు ఎన్టీఆర్ ప్రస్తుతానికి విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా మేకోవర్ అయ్యే పనిలో ఉంటాడట.

Similar News