మళ్లీ బాలయ్యను డీ కొంటానంటున్న కుర్ర హీరో

Update: 2016-12-01 06:32 GMT

2016 సంక్రాంతి పండుగకి నాలుగు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నందమూరి కుటుంబ కథానాయకుల మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, యూవి క్రియేషన్స్ వారి ధైర్య సాహసాల పుణ్యమా అని యువ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలో ఎక్ష్ప్రెస్స్ రాజా అంటూ వచ్చాడు. మరో వైపు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా ఒకే ఒక్క రోజు వ్యవధిలో విడుదల. కాగా ఈ పోటీలో నాన్నకు ప్రేమతో తో తారక్ ఒడ్డున పడగా, ఎక్స్ ప్రెస్ రాజా అతి తక్కువ వ్యయంతో నిర్మితమై మంచి లాభాలే మూటకట్టుకుంది. నాగార్జున నటించి, నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతి రాజు ఐయి సింహాసనం దక్కించుకుంది. ఇక ఎటు తిరిగి నష్టాలు చవి చూసింది నందమూరి బాల కృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రమే.

ఇక 2017 సంక్రాంతికి ఇప్పటికే చిరు, బాలయ్యల ప్రతిష్టాత్మక చిత్రాల విడుదలలతో పోటీ నువ్వా నేనా అనే స్థాయికి చేరుతుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల ఐన మరుసటి రోజే ఈ సంక్రాంతికి కూడా శర్వానంద్ తన శతమానం భవతే చిత్ర విడుదలకు సిద్దమవుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం కాబట్టి థియేటర్లు దొరకటం ఖాయమే కానీ చిరు 150 , బాలయ్య 100 వ చిత్రాల పోటీ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న శతమానం భవతే సంక్రాంతికి ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలపై ఎంత ప్రభావం చూపుతుందో అని సినీ ప్రేమికులలో ఆసక్తి మొదలైయ్యింది.

నిన్న(బుధవారం)టితో శతమానం భవతే చిత్రీకరణ పూర్తి అయిపోయి నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది.

Similar News