మళయాళంలో అమల సెకండిన్నింగ్స్!

Update: 2016-11-10 09:00 GMT

అమల అక్కినేని తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అమలకి మంచి పేరొచ్చింది.... కానీ సినిమా మాత్రం హిట్ అన్నప్పటికీ... పెద్దగా కలెక్షన్స్ పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత అమల రీఎంట్రీ ఇచ్చింది. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అమల ఒక అమ్మ పాత్ర చేసింది. తెలుగులో నటించాక అమల వెంటనే ఆమె బాలీవుడ్ లో కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాలుపెట్టింది. హమారీ అధూరి కహానీలో ఏదో ఒక చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు మలయాళం లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

అంటోనీ సోని డైరెక్షన్ లో ఆమె సినిమా ఒప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అమల ఒక లాయర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమా అంతా అమల, మంజూ వారియర్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. అయితే అమల ఇప్పటివరకు అంటే తన మొదటి ఇన్నింగ్స్ లో మలయాళం లో కేవలం రెండు సినిమాల్లోనే కనిపించింది. ఇక ఇప్పుడు చెయ్యబోయే సినిమా మూడోది. ఇక గత చిత్రాలలో అమల, సురేష్ గోపి, మోహన్ లాల్ పక్కన నటించింది. ఇక ఇప్పుడు మూడో సినిమా లేడీఓరియేంటేడ్ సినిమాగా చేస్తుంది. అంటే అమల ఏ భాషలోనైనా నటించడానికి రెడీగా ఉందని దీనిని బట్టి అర్ధమవుతుంది.

Similar News