మరో అష్టా చెమ్మా కి కొబ్బరికాయ కొట్టారు

Update: 2017-02-02 16:59 GMT

గ్రహణం చిత్రంతో దర్శకత్వ ప్రతిభను చాటుకుని జాతీయ పురస్కార పలకరింపుకి నోచుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తొలి కమెర్షియల్ సక్సెస్ రుచి చూసింది అష్టా చెమ్మా తోనే. ఈ చిత్రంతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ లైం లైట్ లోకి వస్తూ తనతో పాటు నాచురల్ స్టార్ నాని, అవసరాల శ్రీనివాస్, కలర్స్ స్వతి లని కూడా లైం లైట్ లోకి తీసుకొచ్చి వదిలాడు. తరువాత గోల్కొండ హై స్కూల్ వంటి అర్ధవంతమైన సినిమా చేసిన గౌరవం దక్కించుకున్నప్పటికీ కమెర్షియల్ విజయాలకు దూరం అయిపోయాడు ఇంద్రగంటి. గత ఏడాది నాని నటించిన జెంటిల్ మాన్ తో తిరిగి సక్సెస్ ట్రాక్ బాట పట్టాడు.

ఉత్కంఠభరితమైన కథనంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన జెంటిల్ మాన్ హిట్ కావటంతో రెట్టింపు ఆత్మ విశ్వాసం తో తనకి ఇండస్ట్రీ లో గుర్తింపు తీసుకొచ్చినా అష్టా చమ్మా వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో మరో చిత్రం చేయటానికి శ్రీకారం చుట్టాడు ఈ దర్శకుడు. అడవి శేషు, అవసరాల శ్రీనివాస్ కథానాయకులుగా మల్టీ స్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు ఇంద్రగంటి. ఈ చిత్రంలో కథానాయికలుగా ఇషా, అదితి మ్యానికల్ ని సెలెక్ట్ చేశారు. జెంటిల్ మాన్ చిత్రానికి స్వరాలూ సమకూర్చిన స్వర బ్రహ్మ మని శర్మ మరొకసారి ఈ చిత్రం కోసం ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో కలిసి పని చేయనున్నారు. ఈ చిత్ర ముహూర్తం తో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా నేడు ప్రారంభం ఐయ్యింది. తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏ గ్రీన్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కే.వి.నరసింహ రావు నిర్మిస్తున్నారు.

Similar News