మనసులోని మాట నిర్భయం గా చెప్పగలడు!!

Update: 2017-02-13 09:12 GMT

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి తీవ్ర ఉత్కంఠని రేపుతున్నాయి.నేను సీఎం అంటే నేను సీఎం అంటూ పన్నీర్ సెల్వం, శశికళ లు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక గవర్నర్ విద్య సాగర్ రావు మాత్రం తన నిర్ణయాన్ని చెప్పకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు. మరోపక్క కేంద్రం తమిళనాట రాజకీయ పరిస్థితుల్ని డేగ కన్నుతో పర్యవేక్షిస్తుంది. గత నాలుగు రోజులుగా తమిళనాడులో హైడ్రామా నెలకొన్న పరిస్థితుల్లో.... రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడా..... అని ఎదురు చూసుతున్న రజినీకాంత్ అదిగో రాజకీయాల్లోకి వస్తున్నాడు... ఇదిగో రాజకీయాల్లోకి వస్తున్నాడని అనడమే గాని రజిని మాత్రం తన డెసిషన్ ని ధైర్యం గా చెప్పలేకపోతున్నారు. ఇకపోతే తమిళ స్టార్స్ అంతా పన్నీర్ సెల్వాన్ని మాత్రమే సీఎం గా సపోర్ట్ చేస్తున్నారు. శశికళ సీఎం కుర్చీ ఎక్కడానికి కుదరదని తెగేసి చెప్పడం లేదుగాని పన్నీర్ సెల్వం సీఎం అయితే తమిళనాడు బాగుపడుతుందని చెబుతున్నారు.

అయితే నటుడు కమల్ హాసన్ మాత్రం ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో తమిళ రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నాడు. కమల్, శశికళ సీఎంగా అనర్హురాలని పన్నీర్ సీఎం అయితే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని ఇంతకుముందే చెప్పారు. ఇక ఇప్పుడు కమల్ ట్విట్టర్ లో 'అధికారం రెండు రకాలు. ఒకటి శిక్ష పడుతుందన్న భయంతో అధికారం చేపట్టడం, రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్టడం- మహాత్మాగాంధీ (నేను అనుసరించే హీరో)' అంటూ ట్వీట్ చేసాడు . మరి కమల్ హాసన్ అసలు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడనేది ఈపాటికే అందరికి అర్ధమైపోయి ఉంటుంది. ఇక కమల్ ఎంతో ధైర్యం గా ఎవరికీ భయపడకుండా తన అభిప్రాయాన్ని ఇలా నిర్భయంగా చెప్పడంపై అందరూ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

Similar News