మణితో కమిట్ అయిన జ్యోతిక

Update: 2017-09-09 08:00 GMT

మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలని చాలామంది ఆర్టిస్టులు కళలు కంటారు. అంత అద్భుతమైన దర్శకుడు ఈ మధ్య ఘోరమైన ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. అయన తెరకెక్కించిన సినిమా లన్ని వరసగా బోల్తా కొడుతున్నాయి. ఆయన గత చిత్రం కార్తీ - అతిధి కలయికలో వచ్చిన 'చెలియా' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. ఇక తర్వాతి సినిమాతో ఎలాగైనా తన అభిమానులని ఖుషీ చేయాలి అని ఫిక్స్ అయ్యి ఈ సారి స్క్రిప్ట్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారట మణిరత్నం. ఇదిలా ఉంటె ఆయన దర్శకత్వంలో నటించడానికి సూర్య భార్య, కోలీవడ్ నటి జ్యోతిక ఎప్పట్నుంచో ఎదురు చూస్తుంది.

అయితే జ్యోతిక కల చివరికి ఇప్పుడు నెరవేరింది అంటున్నారు. అవును మణిరత్నంతో ఒక సినిమా చేయడానికి జ్యోతిక తాజాగా ఒప్పంద పత్రాలపై సంతకం కూడా చేసిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే కోలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన జ్యోతిక.... ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో మళ్ళీ టాప్ రేంజ్ కి వెళ్తుంది అని అంటున్నారు కోలీవుడ్ ప్రేక్షకులు. ఇదిలా ఉంటె మణిరత్నం, జ్యోతిక తో కలిసి తియబోయేది లేడి ఒరిఎంటేడ్ సినిమానా... లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళ కలయికలో సినిమా వస్తుంది అని తెలియగానే అటు తమిళ జనాలతో పాటు ఇటు తెలుగు జనాలు కూడా ఎదురు చూడటం మొదలెటసారు.

Similar News