భాగమతి థియేటర్ వద్ద పగలబడి నవ్వుకునే సంఘటన!!

Update: 2018-01-31 12:00 GMT

మీరు సోషల్ మీడియాలో కానీ..టీవీ చానెల్స్ లో కానీ హైలైట్ అవ్వాలనుకుంటున్నారా... అయితే బాగా ఫేమస్ వ్యక్తిని కానీ.. బాగా ఫేమస్ సినిమాని కానీ టార్గెట్ చేసి ఏకిపారేయండి. ప్రస్తుతం ఇలాంటివే జరుగుతున్నాయి ఇండియాలో. పద్మావత్ సినిమా విషయంలో రాజ్ పుత్ వర్గీయులు - కర్ణి సేన సభ్యులు ఎందుకు ఇంత మితిమీరిన నిరసన చేపట్టారో సినిమా చూసిన వాళ్ళకు ఇసుమంత కూడా అర్థం కావడం లేదు. సినిమాలో తమ మనోభావాలు దబ్బతిన్నాయి అంటూ సినిమా రాకముందు చేసిన నిరసనలు సినిమా రిలీజ్ అయ్యాక కనపడటం లేదు.

పేరులో చివర...

ఇది ఇలా ఉంటే.. తమిళనాడులో భాగమతి ప్రదర్శిస్తున్న థియేటర్ బయట పెద్ద జోక్ ఏటంటే.. పద్మావతి, భాగమతి రెండు పేరులో చివర మతి అనే సౌండింగ్ కామన్ గా ఉండటంతో ముందు వెనుక చూసుకోకుండా భాగమతి ప్రదర్శిస్తున్న థియేటర్ బయట దీపికా పదుకునే బ్యానర్ పట్టుకుని నిరసన చేయటం మొదలు పెట్టారు. పోనీ ఒకేచోట ఈ రెండు సినిమాలు ఆడుతున్నాయి అంటే అది కాదు.. పద్మావతి అక్కడికి దూరంగా ఉన్న వేరొక థియేటర్లో ఆడుతోంది. నిరసన మొదలు పెట్టిన కాసేపటికి అనుమానం వచ్చిన యాజమాన్యం బయటికి వచ్చి చూస్తే దీపికా పడుకునే బ్యానర్లు - తనకు వ్యతిరేకంగా అరుపులు వినిపించాయి. మనసులో నవ్వుకుని సదరు థియేటర్ వర్గాలు బాబు ఇది పద్మావతి కాదు భాగమతి కావాలంటే లోపలికి వెళ్లి చూసుకోండి చెప్పారు. కంగు తిన్న ఆ నిరసనకారులు ఏం చేదిలేక అక్కడ నుండి వెళ్లిపోయారు.

ఈలోపే సినిమా అయిపోయి...

అక్కడ నుండి డైరెక్ట్ గా పద్మావత్ థియేటర్ కు వెళ్లారు. ఈ లోపే మ్యాట్నీ షో పూర్తయ్యి జనం కూడా బయటికి వచ్చేసారు. ఈ మొత్తాన్ని కొందరు ఓ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసినా ప్రతి ఒక్కరు పగలబడి నవ్వుకుంటున్నారు.

Similar News