భలే సందడి కదూ!!.

Update: 2017-07-09 14:00 GMT

మహేష్ బాబు 'స్పైడర్' చిత్ర షూటింగ్ సుదీర్ఘంగా సాగుతూనే వుంది. ఇంకో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెబుతున్న డైరెక్టర్ గారు ఇంకా షూటింగ్ జరుపుతూనే వున్నారు . ఇక మహేష్ కూడా చేసేదిలేక 'స్పైడర్' కోసం డేట్స్ కేటాయిస్తూనే వున్నాడు. మహేష్ - రకుల్ ప్రీత్ సింగ్ ల మీద తెరకెక్కిస్తున్న పాటల కోసం డైరెక్టర్ మురుగదాస్ బాగానే ఖర్చు పెడుతున్నాడు. ప్రత్యేకమైన సెట్స్ లో ఈ పాటల చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఇపుడు మురుగదాస్ - మహేష్ 'స్పైడర్' సెట్స్ లో ఒక బుల్లి పాప సందడి చేసింది. ఆ బుల్లి పాప ఎవరో కాదు మహేష్ బాబు తనయ సితార.

'స్పైడర్' సెట్ లో సితార, మహేష్ తో, రకుల్ ప్రీత్ తో సరదాగా గడుపుతూ సందడి చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ ఈ ఫొటోల్ని క్లిక్‌ మనిపించేశారు. అయితే సితార, మహేష్ దిగిన కొన్ని ఫొటోల్ని సంతోష్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తే... సితారతో తాను దిగిన ఫొటోని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్ లో షేర్‌ చేసింది. మరి అక్కడ సితార అల్లరి చూసి మహేష్ ఎంతగా పొంగిపోయాడో అని అంటున్నారు మహేష్ అభిమానులు. ఎప్పుడూ ఫ్యామిలీతో మంచి అనుబంధం కొనసాగించే మహేష్ తన పిల్లలతో దొరికిన సమాయన్ని ఫుల్ గా స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేసే విషయం తెలిసిందే.

Similar News