భరత్ మూడురోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

Update: 2018-04-23 08:36 GMT

మహేష్ బాబు 'భరత్ అనే నేను' తో భారీ హిట్ కొట్టాడు. కొరటాలతో కలిసి 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ అందుకున్నట్టే.. మళ్ళీ 'భరత్ అనే నేను' తో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. అందుకే మహేష్ బాబూ కూడా ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. అందుకే భార్యతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. అలాగే భరత్ టీమ్ కి పార్టీలు గట్రా ఇచ్చేస్తున్నాడు. ఇక నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొడుతూ.. గత మార్చ్ 30 న విడుదలైన రామ్ చరణ్ 'రంగస్థలం' కలెక్షన్స్ కి చుక్కలు చూపెడుతూ బాక్సాఫీసుని చెడుగుడు ఆడుకుంటున్నాడు. మహేష్ రెండు సినిమాల డిజాస్టర్స్ ని ఇచ్చి ఇప్పుడు కొరటాలతో కలిసి మళ్ళీ ఫ్యాన్స్ కి భరత్ వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు. గత శుక్రవారమే విడుదలైన 'భరత్ అనే నేను' మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది.

ఏరియా: మూడు రోజుల కలెక్షన్స్ కోట్లలో

నైజాం 10.18

సీడెడ్ 5.50

నెల్లూరు 1.42

కృష్ణా 3.38

గుంటూరు 5.57

వైజాగ్ 5.18

ఈస్ట్ గోదావరి 4.42

వెస్ట్ గోదావరి 2.63

తెలంగాణ మరియు ఏపీ మూడురోజుల కలెక్షన్స్: 38.28

Similar News