భరత్ నాలుగోరోజు తగ్గలేదు!!

Update: 2018-04-24 08:51 GMT

భరత్ అనే నేను హిట్ అవడంతో నా రెండేళ్ల ఒత్తిడి తొలిగిపోయి ఆనందంగా ఉన్నానని చెప్పడం చూస్తుంటే మహేష్ బాబు గత రెండేళ్లుగా ఎంతగా టెన్షన్ పడ్డాడో అర్ధమవుతుంది. బ్రహ్మ్మోత్సవం భారీ ప్లాప్ తర్వాత కూడా మురుగదాస్ స్పైడర్ వంటి డిజాస్టర్ నే ఇచ్చాడు. కానీ మహేష్ బాబు ఎక్కడా తొణికినట్టుగా బెణికినట్టుగా కనబడలేదు. కానీ ఈ రెండేళ్ల పాటు తానెంత మదన పడ్డాడో నిన్న సోమవారం సాయంత్రం భరత్ అనే నేను మూవీ సక్సెస్ మీట్ లో చెప్పేసాడు. తనకి డబ్బు, హోదా, చేతినిండా పని ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా అభిమానులను నిరాశపరిచానని.. అందుకే తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని... కానీ తన ఒత్తిడిని కొరటాల శివ భరత్ అనే నేను హిట్ ఇచ్చి తగ్గించారని ఎమోషనల్ గా మాట్లాడాడు మహేష్. మరి గత శుక్రవారం విడుదలైన భరత్ అనే నేను మొదటి వీకెండ్ లో బాగానే లాగేసింది. ఇకసోమవారం భరత్ పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటే... సోమవారం కూడా భరత్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిలకడగా నిలబడి మంచి కలెక్షన్స్ సాధించింది. భరత్ అనే నేను నాలుగు రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 11.76

సీడెడ్ 6.10

నెల్లూరు 1.59

కృష్ణా 3.85

గుంటూరు 6.03

వైజాగ్ 5.68

ఈస్ట్ గోదావరి 4.80

వెస్ట్ గోదావరి 2.87

ఏపీ మరియు టీఎస్ భరత్ నాలుగు రోజుల కలెక్షన్స్ కోట్లలో 42.68

Similar News