భరత్ అనే నేను ప్రీ రిలీజ్ బిజినెస్!

Update: 2018-04-16 07:26 GMT

మహేష్ బాబు మొదటిసారి పొలిటికల్ బ్యాక్డరోప్ లో సీఎం గా నటించిన భరత్ అనే నేను సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో వేరే చెప్పక్కర్లేదు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించిన టాపిక్ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఓవర్సీస్ లోను బాగా వినబడుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అందరిని మెప్పించే విధంగా వచ్చిందని చిత్ర బృందం చెబుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టే లెవల్లో జరిగిందనే టాక్ బయటికి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందంటున్నారు. మరి భరత్ కి హిట్ టాక్ పడిందా కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో ఉండడమే కాదు 100 కోట్ల షేర్ ఈజీగా తెచ్చేసుకుంటుందని కూడా అంటున్నారు. అలాగే ఓవర్సీస్ లోను భరత్ మీద భారీగా పెట్టుబడి పెట్టారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ భరత్ మీద 18 కోట్లు పెట్టగా... మొదటి రోజే 350 లొకేషన్లకు పైగా రెండు వేల ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం చూస్తే 3 మిలియన్ మార్క్ భరత్ చేరుకోవడం పెద్ద కష్టమయ్యే పని కాదనిపిస్తుంది. ఇక ఏరియాల వారీగా భరత్ ప్రీ రిలీజ్ లెక్కలు మీకోసం.

ఏరియా ప్రీ బిజినెస్ లెక్కలు (కోట్లలో)

నైజాం 22

సీడెడ్ 12

ఉత్తరాంధ్ర 8 .70

తూర్పు గోదావరి 6 .70

కృష్ణా మరియు గుంటూరు 13 .60

పశ్చిమ గోదావరి 6

నెల్లూరు 3

రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 72 కోట్లు

కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు 9 కోట్లు

ఓవర్సీస్ 18 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా భరత్ అనే నేను చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 99 కోట్లు

Similar News