భరత్ అనే నేను గురించి కైరా మాటల్లో

Update: 2018-03-28 05:16 GMT

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలానే కష్టపడాలి కానీ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మాత్రం చాలా అవలీలగా తెలుగులోకి ఎంటర్ అయ్యి ఏకంగా మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదట 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల - మహేష్ చాలా మంది హీరోయిన్ ల పేర్లు అనుకున్నారు. కానీ చివరికి ఆ అదృష్టం కైరాకే దక్కింది.

అయితే లేటెస్ట్ గా ఆమె తన మనసులో మాటలు ప్రేక్షకులతో పంచుకుంది. 'ఇలాంటి టీంతో పని చేసే అదృష్టం రావడం నా అదృష్టం. వారంతా నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించాను' అని చెప్పింది కైరా. నా డిగ్రీ ఫినిష్ అవ్వగానే నేను ఇండస్ట్రీలోకి రావాలని భావించాను కానీ ఇక్కడ ఒక్క గ్లామర్ ఉంటే సరిపోదు బోలెడంత హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. అలానే పక్కా హైద్రాబాదీ అమ్మాయి పాత్రను పోషిస్తున్నానని.. ముందే డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు ఇవ్వడంతో.. బాగా ప్రాక్టీస్ చేశానని..ఈ క్యారెక్టర్ ప్రతీ మహిళకు కనెక్ట్ అవుతుందని చెప్పింది. అంతేకాదు మహేష్ అసలు స్టార్ హోదా ఫీల్ కాడని.. తనకు డైలాగ్స్ విషయంలో చాలా సార్లు హెల్ప్ చేశాడంటోంది కైరా.

Similar News