బొంబాయి వచ్చే సరికి లుంగీ కట్టాల్సివచ్చింది

Update: 2017-01-13 18:06 GMT

సందర్భం ఏదైనా తమిళ తంబిలకు సౌకర్యమైన, సాంప్రదాయ దుస్తులు అంటే లుంగీ నే. ఇతర రాష్ట్రాలలో కూడా లుంగీ వాడతారు కానీ తమిళ తంబిలలా పండగలకి పెళ్ళిళ్ళకి కూడా లుంగినే ధరించే సంస్కృతి ఎక్కడా లేదు. ఇక తమిళనాడు లో తప్ప మిగిలిన రాష్ట్రాలలో మారుతున్న తరం సౌకర్యార్ధం దృష్ట్యా లుంగీ కనుమరుగైపోతుంది. కానీ మూడేళ్ళ క్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్ష్ప్రెస్స్ చిత్రంలోని లుంగీ డాన్స్ పాట కారణంగా మళ్లీ ఉత్తరాది రాష్ట్రాలలోనూ లుంగీకి క్రేజ్ పెరిగిపోయింది. షారుఖ్ ఖాన్ వల్ల ఊపందుకున్న ఈ లుంగీ మానియా ఇప్పుడు హాలీవుడ్ హీరో విన్ డీసెల్ ని కూడా తాకింది.

రేపు(14 జనవరి) భారత దేశంలో విడుదల కానున్న xxx రిటర్న్స్ ఆఫ్ గ్జాండర్ కేజ్ లో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటించటంతో భారత దేశంలో కూడా ఈ చిత్రానికి భారీగా క్రేజ్ పెరిగిపోయింది. విదేశాలలో కంటే ఆరు రోజులు ముందుగానే ఈ చిత్రాన్ని భారత దేశంలో విడుదల చేసే విధంగా నిర్మాతల పై ఒత్తిడి తెచ్చింది దీపికా పదుకొనె. దాని ఫలితంగానే బొంబాయి లో ప్రచార కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చిన విన్ డీసెల్ చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో లుంగీ డాన్స్ పాటకు వేదిక పై కాలు కదుపుతుంటే తనకి ఒక లుంగీ అందించి దీపికా కూడా లుంగీ కట్టుకుని వేదికపై విన్ డీజిల్ తో కలిసి చిందేసింది. చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో షారుఖ్ సరసన నటించిన హీరోయిన్ దీపికా కావటం మరో విశేషం.

Similar News