బిగ్ బి, సల్మాన్ లను ఫాలో అవుతున్న మాస్ మహా రాజా

Update: 2017-02-02 19:30 GMT

మాస్ మహా రాజా రవి తేజ నటుడిగా కెరీర్ ప్రారంభం చేసిన నాటి నుంచి 2015 వరకు ప్రతి ఏడాది తాను నటించిన చిత్రాలు కనీసం రెండు విడుదలలు ఉండేలా ప్లాన్ చేసుకునే వాడు. కానీ 2015 లో రవి తేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రం విడుదల తరువాత నేటి వరకు రవి తేజ నటించిన మరో చిత్రం విడుదల కాలేదు. దీనితో ఆశించని విధంగా రవి తేజ కి ప్రేక్షకులకి మధ్య గ్యాప్ ఏర్పడింది. బెంగాల్ టైగర్ అనంతరం పలు ప్రాజెక్ట్స్ సెట్ చేయటానికి రవి తేజ కృషి చేసినప్పటికీ అవి పట్టాలెక్కలేదు. ఇప్పటి వరకు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా లేని మాస్ మహా రాజా ప్రేక్షకులతో మమేకమై గ్యాప్ ని భర్తీ చేయటానికి నిన్న(బుధవారం) ట్విట్టర్ ఖాతా ని ఓపెన్ చేసి అభిమానులతో ముచ్చటించటం ప్రారంభించాడు.

రవి తేజ ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన మూడు గంటల వ్యవధిలోనే అతనిని ఫాలో అయ్యే నెటిజనుల సంఖ్య ఏడు వేలకు చేరిపోయింది. కాగా రవి తేజ ఇద్దరినీ ఫాలో అవుతున్నారు. వారిలో ఒకరు తనకి సినిమా పరిశ్రమలోకి రావటానికి స్ఫూర్తినిచ్చిన నటుడు అని రవి తేజ పలుమార్లు చెప్పిన ఆయన అభిమాన స్టార్ హీరో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కాగా మరొక స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన అనంతరం, "ఇంత కాలం స్నేహితులంతా ట్విట్టర్ లో వుండే కంఫర్ట్ గురించి చెప్తుంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఒకసారి ట్రై చేయాలనిపించింది. ట్విట్టర్ లో ఇంత కిక్ ఉంటుంది అని ఇప్పుడే తెలిసింది." అంటూ ట్వీట్ చేసి అభిమానులని పలకరించాడు రవి తేజ.

హరీష్ శంకర్, సునీల్, గోపీచంద్ మలినేని, ఛార్మి, మెహరీన్, థమన్ వంటి పలువురు సెలబ్రిటీస్ ట్విట్టర్ లో మాస్ మహా రాజా కి ఘన స్వాగతం పలికారు.

Similar News