బిగ్ బి ని స్నేహితులతో జాగ్రత్త అని హెచ్చరించిన వర్మ

Update: 2017-01-29 08:42 GMT

బొంబాయి సినీ వర్గాలతో పాటు యావత్ భారత దేశంలో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమా సర్కార్-3. ఇండియన్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో సర్కార్, సర్కార్-2 లను అద్భుతంగా తెరకెక్కించి అమిత్ జి లోని అగ్రసివ్ నెస్ ని కొత్త కోణంలో చూపటమే. మార్చ్ నెలలో విడుదల కానున్న సర్కార్-3 చిత్రీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కాగా అటు అమితాబ్ బచ్చన్ ఇటు రామ్ గోపాల్ వర్మ లు ఇద్దరూ సినిమాలకు అతీతమైన విషయాలను కూడా ట్విట్టర్ ద్వారా తమ ఫాలోయర్స్ తో పంచుకుంటుంటారు. అలా అమితాబ్ బచ్చన్ మనిషి విజయాలు అందుకోవటానికి మంచి స్నేహితులు అవసరం, కానీ మనిషి మరెవరికి సాధ్యపడని విజయాలు అందుకోవాలంటే తెలివైన శత్రువులు ఉండాలి అని ఒక ట్వీట్ చేశారు.

T 2515 -" We need better friends to get success in life.. But we need better enemies to get extra - ordinary success in life... " ~

బిగ్ బి చేసిన ఈ ట్వీట్ కి తన ప్రతి స్పందన గా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ మనిషిని స్నేహితుల నుంచి ఎవరు కాపాడలేరు సర్కార్. వెన్ను పోటు ని తట్టుకోవటం కంటే శత్రువు ఎదురు దాడిని ఎదుర్కోవటం చాలా తేలిక అంటూ తనదైన శైలిలో బిగ్ బి కి సైతం రీట్వీట్ చేసాడు వర్మ.

Sarkar we can't protect ourselves from friends because they stab from back whereas enemies atleast have the courage to attack from front

Similar News