బాహుబలితో నా సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయింది

Update: 2017-03-03 10:42 GMT

ఏ టెక్నీషియన్ లేదా ఆర్టిస్టయినా ఒక చిత్రం కోసం నాలుగు సంవత్సరాలు పని చేయాల్సి రావటం అంటే కెరీర్లో చాలా నష్ట పోతున్నట్టే. కానీ బాహుబలి విషయానికి వచ్చే సరికి ఆ సినిమా కోసం నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని వెచ్చించిన వారందరికీ బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో విజయ పతాకం ఎగురవేయటంతో ఎవరి కష్టం వృధాగా పోలేదు. అయితే తెలుగు సినిమా కాబట్టి ఒక తెలుగు టెక్నీషియన్ బాహుబలి ని ఇంతలా నమ్మి ఇంత కాలాన్ని, కఠోర శ్రమని పెట్టుబడిగా పెట్టి పని చేయొచ్చు. కానీ ఒక తమిళ రచయిత పర భాష చిత్రం కోసం ఇంతటి కష్టానికి ఓర్చటం అంటే అది ఒక విధంగా త్యాగం కిందే పరిగణించాలేమో.

తమిళంలో ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తు తనయుడిగా సినిమా పరిశ్రమకి పరిచయమై ప్రేమ్ రథం ధన్ పాయో, బాజీరావు మస్తానీ, మనమంతా వంటి ఇతర భాష చిత్రాలకి తమిళ అనువాద రూపంలో సంభాషణలు రచించి బాహుబలి తమిళ సంభాషణల బాధ్యతలని స్వీకరించిన మదన్ కరికీ అనువాద చిత్రం తరహాలో పని చేయటం మాత్రమే కాకుండా బాహుబలిలో మనం చూసిన కాలికేయుడి భాష మరియు దాని లిపిని రచించి దర్శకుడు రాజమౌళితో ఓకే చెఇంచిన ఘనతను పొందాడు. తాజాగా పూర్తయిన తమిళ బాహుబలి డబ్బింగ్ అనంతరం మదన్ కరికీ ట్వీట్ చేస్తూ బాహుబలి తో సాగిన తన నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ముగిసిందంటూ ప్రకటించాడు.

రాజమౌళి సినిమాకి పనిచేయటానికి చాలా కాలం క్రితం నుంచే తమిళంలో శంకర్ దర్శకత్వం వహించే చిత్రాలకు సంభాషణల రచయితగా, ఇంకా ఎన్నో చిత్రాలకు సాహిత్య రచయితగా కూడా మదన్ కరికీ రాణించాడు.

Similar News