'బాహుబలి' ని తన్నేసిందట

Update: 2017-09-05 14:59 GMT

తమిళంలో అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'వివేగం' చిత్రం ఆగష్టు 24 న కోలీవుడ్ లో టాలీవుడ్ లో విడుదలైంది. అయితే కోలీవుడ్ లో అజిత్ అభిమానులకు నచ్చిన ఈ సినిమాని మిగతా ప్రేక్షకులు దాదాపు రిజెక్ట్ చేశారు. అసలు తెలుగులో అయితే ఈ సినిమా కి ఫుల్ గా నెగెటివ్ టాక్ రావడం.... ఆ మరుసటి రోజు విడుదలైన విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రం సూపర్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో 'వివేకం' కలెక్షన్స్ తగ్గినాయి. అయితే తమిళంలోనూ నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ అజిత్ చేసిన యాక్షన్.. దర్శకుడు శివ మేకింగ్ స్టైల్ కి కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయనే ప్రచారం మొదలయ్యింది.

'వివేగం' ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3000 థియేట‌ర్ల‌లో రిలీజైంది. తొలి రోజే 33 కోట్ల మేర వ‌సూళ్లు సాధించి ఆహా అనిపించడమే కాదు... విడుదలైన ఈ 10 రోజుల్లోనే 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి అజిత్ కున్న క్రేజ్ ని ఈ 'వివేగం నిరూపించింది'. అయితే ఇప్పుడు ఈ 'వివేగం' మరో రేర్ ఫీట్ సాధించిందని ప్రచారం మొదలైంది. అదేమిటంటే రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ప్రభంజనాన్ని తమిళంలోని చెన్నై నగరంలో ఈ 'వివేగం' కలెక్షన్స్ అడ్డుకట్ట వేసిందనే న్యూస్ సోషల్ మీడియా వ్యాప్తంగా తెగ సర్క్యులేట్ అవుతుంది. అజిత్ నటించిన ఈ 'వివేగం' చిత్రం బాహుబ‌లి చెన్న‌య్ వ‌సూళ్ల‌ను తిర‌గ‌తోడింది.

ఈ చిత్రం 8 కోట్ల వ‌సూళ్ల‌తో చెన్న‌య్ న‌గ‌రంలో బాహుబ‌లి ఫుల్ ర‌న్‌లో సాధించిన వ‌సూళ్ల రికార్డును అధిగ‌మించింది. రెండో వారానికే ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏకైక హీరోగా అజిత్ పేరు మార్మోగిపోతోందిప్పుడు. మరి ఈ లెక్కన జాతీయ స్థాయిలో 'బాహుబలి'కి ఎదురు లేకుండా పోయిందని అనుకునే వారికి ఈ 'వివేగం' కలెక్షన్స్ దిమ్మతిరిగే సమాధానం చెప్పిందంటున్నారు కొందరు.

Similar News