బాహుబలి ది కంక్లూషన్ గీతావిష్కరణకి హాజరు కానున్న కరణ్

Update: 2017-03-24 11:11 GMT

2015 లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని ఉత్తరాది దేశాన అత్యద్భుతంగా ప్రోమోట్ చేసి బాహుబలి అనే చిత్రానికి భాష భేదం అడ్డు గోడగా నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చిత్ర భారీ విజయానికి తన వంతు దోహదపడ్డారు హిందీ వెర్షన్ సమర్పకులు, బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్. కరణ్ జోహార్ బొంబాయి నగరంలో ఉంటూనే బాహుబలి ది బిగినింగ్ సమయంలో లీడ్ యాక్టర్స్ ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా లను అక్కడికి పిలిపించి అక్కడి మీడియా కు ఇంటర్వ్యూలు ఇప్పించటంతోపాటు పలు వినూత్నమైన ప్రమోషనల్ ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేశారు కరణ్ జోహార్.

బాహుబలి ది బిగినింగ్ ఆశించిన స్థాయి కంటే బాగా ఆడి, కరణ్ జోహార్ కి కోట్ల రూపాయలు గడించి పెట్టటంతో బాహుబలి ది కంక్లూషన్ కి మరీ ఎక్సయిట్మెంట్ తో ఉన్నట్టు కనిపిస్తున్నాడు కరణ్ జోహార్. బాహుబలి ది బిగినింగ్ ఆడియో వేడుక తిరుపతి లో జరిగిన నాడు కరణ్ జోహార్ హాజరు కాలేదు కానీ ఇప్పుడు బాహుబలి ది కంక్లూషన్ ఆడియో వేడుకని ఈ నెల 26 న రామోజీ ఫిలిం సిటీ లోని మాహిష్మతి రాజ్యపు సెట్ దగ్గర నిర్వహించటానికి ఆర్కా మీడియా వారు సన్నాహాలు చేసుకుంటుండగా, బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ ఈ వేడుకకి హాజరు అవుతూ తనతో పాటు బాలీవుడ్ మీడియాకి చెందిన ప్రముఖులను తీసుకు వస్తున్నాడట. ఈ సారి బాహుబలి హిందీ వెర్షన్ కి ప్రచారం ఆడియో వేడుక వేదిక పై నుంచే ప్రారంభించనున్నాడు కరణ్ జోహార్. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఈ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరు అవ్వనున్నారు

Similar News