బాహుబలి తప్ప మరో ఆలోచన లేదంటే వినరే

Update: 2017-02-10 05:05 GMT

బాహుబలి ది బిగినింగ్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించటంతో పాటు తెలుగు సినిమా స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించి చరిత్రలో సరికొత్త అధ్యయనాలు రాసాడు. బాహుబలి ది కంక్లూషన్ సెట్స్ పై ఉండగానే చాలా ప్రాంతాల విడుదల హక్కులు ఫాన్సీ రేట్లకు విక్రయించబడ్డాయి. అంతటి క్రేజ్ తో ఎప్పటి నుంచో బజ్ కొనసాగించుకుంటున్న బాహుబలి ది కంక్లూషన్ పై ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కళ్ళు కూడా పడ్డాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు మరో వైపు విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటుంది బాహుబలి. కాగా జక్కన్న కు ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధం చేయటానికి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే మిగిలి వుంది. దానితో రాజమౌళి తన పూర్తి దృష్టిని ఈ చిత్రం పైనే కేంద్రీకరించి వివిధ టీంలతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ పై ఊహాగానాలు అధికం అయ్యాయి. బాహుబలి అనంతరం జక్కన ఈగ-2 చేయనున్నాడని కొందరు ప్రచారం చేస్తుంటే, గరుడ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తారని మరి కొందరు, బాహుబలి కి మరో భాగం మిగిలి ఉందని, ఈ వేసవి నుంచి ఆ చిత్రం కోసం పని చేస్తాడని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఒక ఆంగ్ల దిన పత్రిక ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రాజమౌళి తదుపరి హీరోల పేర్లు కూడా ప్రకటించేసింది. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ముల్టీస్టార్ర్ గా ప్లాన్ చేస్తున్నాడని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషాలలోనూ ఆ చిత్రాన్ని గ్రాండ్ గా చేయాలనే ఆలోచనతో ఆ చిత్రానికి రజని కాంత్, మోహన్ లాల్, ఆమిర్ ఖాన్ లను కథానాయకులుగా ఎంచుకున్నాడని ప్రచురించింది. దీనితో ఈ చిత్ర బడ్జెట్ పై పలు అభిప్రాయాలు వ్యక్తం అవటం మొదలు కావటంతో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ పుకార్లను తొలిలోనే అంతమొందించటం మంచిదని ఆలోచించి ఆంగ్ల పత్రికలో వచ్చిన కాంబినేషన్ లో చిత్రాన్ని ఖండిస్తూ రాజమౌళి బాహుబలి తరువాతి చిత్రం పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Similar News