బాహుబలి ఆడియో అతిధి ఎవరో తెలుసా?

Update: 2017-03-25 06:38 GMT

'బాహుబలి ది కన్ క్లూజన్' సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం బాహుబలి ది కన్ క్లూజన్ ట్రైలర్ ని చూసి అదరహో అని కితాబునిస్తుంటే ఇప్పుడు మరో వేడుకకి బాహుబలి 2 రంగం సిద్ధం చేస్తుంది. బాహుబలి ది కన్ క్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 26 న భారీ లెవల్లో జరిపించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ ఈవెంట్ కి కేవలం బాలీవుడ్ నుండి కరణ్ జోహార్ తోపాటు అక్కడి మీడియా మాత్రమే హాజరవుతుందని... టాలీవుడ్ ప్రముఖుల్ని ఈ ఈవెంట్ కి రాజమౌళి ఆహ్వానించలేదని విశ్వసనీయ సమాచారం.

ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖుల్ని పిలవకపోయినా ఏప్రిల్ 9న‌ చెన్నైలో జరిగే 'బాహుబలి ది కన్ క్లూజన్' ఆడియో ఈవెంట్‌కి మాత్రం చాలామంది అతిధులు హాజరవుతారని... ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఇంకా కోలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఆడియో వేడుకకి హాజరవుతారని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కాటమరాయుడు క్రేజ్ కి బ్రేక్స్ వేసి మరీ బాహుబలి హవా స్టార్ట్ అవుతోందని ఈ హవా ఇప్పటినుండి ఏప్రిల్ 28 వరకు అలాగే కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రభాస్, అనుష్క,రానా,తమన్నా తదితరులు నటించిన ఈ బాహుబలి ద కంక్లూజన్ వచ్చే నెల 28 న ప్రపంచవ్యాప్తం గా విడుదలవుతుంది.

Similar News