బాలీవుడ్ భామల విషయంలో తికమక పడుతున్న హాలీవుడ్

Update: 2017-01-06 05:47 GMT

సౌత్ ఇండియన్ ఫిలిం హీరోయిన్స్ బాలీవుడ్ లో నటించాలని, బాలీవుడ్ లో హీరోయిన్స్ హాలీవుడ్ లో నటించాలని కలలుకనటం సహజం. అయితే ఆ అవకాశం అతి తక్కువ మంది కథానాయికలకు మాత్రమే వరిస్తుంటుంది. అది కూడా ఎప్పుడో ఒక చిత్రం లో మెరిసి తిరిగి వచేయటమే తప్పితే అక్కడ స్థిరపడిపోయి చక్రం తిప్పే స్థాయికి చేరుకోవటం అసాధ్యం. 2015 లో విడుదలై సంచలనం సృష్టించిన మరాఠా యోధుడి కథగా తెరకెక్కిన బాజీరావు మస్తానీ చిత్రంలో పోటాపోటీగా నటించిన ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లు ఇద్దరు అనూహ్యం గా గత ఏడాది హాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. క్వాన్టికో టెలి సిరీస్ తో పాటు బే watch అనే ఆంగ్ల చిత్రంతో హాలీవుడ్ లో బిజీ అయిపోయింది ప్రియాంక చోప్రా. మరో పక్క దీపికా పదుకొనె xxx రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ అనే చిత్రం ద్వారా హాలీవుడ్ కి పరిచయమైంది.

దీపికా పదుకొనె నటించిన ఆంగ్ల చిత్రం మన దేశం లో ఈ నెల 14 న, విదేశాలలో 19 న విడుదల కానుండటంతో చిత్ర బృందమంతా ప్రచార కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. అయితే హాలీవుడ్ మీడియా తో పాటు విదేశీయులు నడుపుతున్న కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారికి ఇద్దరు బాలీవుడ్ కథానాయికలలో ఎవరి పేరు ఏంటో ఇంకా అలవాటైనట్టు లేదు పాపం. xxx రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ప్రచార కార్యక్రమాలలో దీపికా ఇచ్చిన ఫోటో షూట్ మరియు తాను మాట్లాడిన వీడియో మొత్తాన్ని పోస్ట్ చేస్తూ ప్రియాంక చోప్రా పేరు తో ప్రచురించింది హాలీవుడ్ మీడియా. అనంతరం వారి పొరపాటు గ్రహించి హెడ్డింగ్ లో పేరు మార్చినప్పటికీ మట్టెర్లోకి వెళ్తే కథానాయిక ఇంట్రడక్షన్ అంత ప్రియాంక చోప్రా కి సంబంధించిన విశేషాలే ప్రత్యక్షమయ్యాయి. మొత్తానికి కాస్టింగ్ డీటెయిల్స్ లో బాగా పకడ్బందీగా వుండే హాలీవుడ్ ని మన భామలు బాగా తికమక పెట్టేస్తున్నారు.

Similar News