బాలయ్యని 'టపోరీ'ని చేస్తున్న పూరి!!

Update: 2017-03-21 10:53 GMT

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది బాలకృష్ణ 101వ చిత్రం అన్న విషయం కూడా విదితమే. అప్పుడే.. దర్శకుడు పూరీ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశాడు. త్వరలో చిత్రబృందం షూటింగ్ కోసం యూరోప్ పయనం కాబోతుంది. అయితే బాలయ్యబాబు, పూరి కాంబినేషన్ లో తీస్తున్న ఈ చిత్రానికి టైటిల్ పై కూడా దృష్టి సారిస్తున్నాడంట దర్శకుడు. సహజంగా పూరి సినిమా టైటిళ్ళను పెట్టడంలో చాలా వండర్ ఫుల్ గా స్టోరీకి కనెక్టు అయ్యేలా ఎంచుకుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే.

పూరి ఏ సినిమాకైనా టైటిల్ చాలా సహజంగా, కొన్నాళ్ళ పాటు ప్రేక్షకుల మదిలో నానేలా, చాలా క్యాచీగా పెడుతుంటాడు. అది చాలా వైవిధ్యంతో కూడుకొని ఉండి ఆ పదం తాలూకూ చరిత్రను తెలుసుకొనేలా ఉంటుంది. అంటే ఎవ్రీ వర్డ్ హాజ్ ఇట్స్ ఓన్ హిస్టరీ అన్న చందంగా పూరి టైటిల్స్ పెట్టడంలో దిట్ట. తాజాగా బాలకృష్ణ చిత్రానికి పూరి ‘టపోరి’ అనే టైటిల్ పట్ల ఆకర్షించినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణకు కూడా ఈ టైటిల్ చెప్పగానే బహుబాగుంది అనేశాడట. అయితే.. ఇప్పుడు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే విషయంలో దర్శకుడు కొంత ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే.. టపోరి అనే టైటిల్ వినగానే చిరంజీవి సినిమాలో ఓ పాట గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ పాట కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. గ్యాంగ్ లీడర్ సినిమాలోని టపు టపు టపోరి అనే ఈ పాట ఎంతటి సెన్షేషన్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకనే దర్శకుడు టైటిల్ పట్ల ఇంకా ఆలోచిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం పూరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో.

Similar News