బాలయ్య పక్కన ఆ భామ?

Update: 2017-10-14 14:00 GMT

బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కలయికలో బాలకృష్ణ 102 వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా మొత్తం ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో ఉంటుందని ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. తమిళనాడులో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కన మెయిన్ హీరోయిన్ గా నయనతార నటిస్తుంది.

అయితే నయనతారతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే మెయిన్ హీరోయిన్ నయనతార కాగా రెండో హీరోయిన్ గా నటాషా దోషి ని ఎంపిక చేసిన చిత్ర బృందం ఇప్పుడు మూడో హీరోయిన్ గా హరిప్రియని సెట్ అయ్యిందనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి సీనియర్ హీరో బాలకృష్ణ పక్కన హరిప్రియ ని గనక నిజంగానే సెట్ చేసినట్లయితే హరిప్రియ పంటపండినట్లే. ఎందుకంటే తెలుగులో చిన్న చితక సినిమాలతో పాపులర్ కాలేకపోయినా హరిప్రియ ఇప్పుడు తమిళ, కన్నడ సినిమాల్లో కాస్త బిజీగా మారింది.

మరి ఇప్పుడు ఈ సీనియర్ హీరో పక్కన హీరోయిన్ గా సెట్ అయితే గనక ఆమె దశ తిరిగి మరలా తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయంటాయన్నారు సినీప్రియులు. చూద్దాం హరిప్రియ ఫెట్ ఎలా వుండబోతుందో.

Similar News