బాలయ్య న్యూ లుక్ అదరహో!!

సినిమాల కోసం బరువు తగ్గాలన్నా, కొత్త లుక్ ట్రై చెయ్యాలన్నా బాలకృష్ణ తర్వాతే ఎవ్వరైనా.. సినిమాల్లో కొత్తదనం కోసం చాలా కష్టపడే తత్త్వం బాలకృష్ణది. ప్రస్తుతం రూలర్ [more]

Update: 2020-01-20 07:49 GMT

సినిమాల కోసం బరువు తగ్గాలన్నా, కొత్త లుక్ ట్రై చెయ్యాలన్నా బాలకృష్ణ తర్వాతే ఎవ్వరైనా.. సినిమాల్లో కొత్తదనం కోసం చాలా కష్టపడే తత్త్వం బాలకృష్ణది. ప్రస్తుతం రూలర్ సినిమా దెబ్బకి ఓ నెల రోజుల నుండి బయట కనబడడమే మానేసిన బాలకృష్ణ బోయపాటి సినిమా కోసం రెడీ అవుతున్నాడనే న్యూస్ ఉంది. ఈలోపు బోయపాటి – బాలయ్య బడ్జెట్ మీద రకరకాల న్యూస్ లు నడిచాయి కూడా. అయితే బాలకృష్ణ మాత్రం బోయపాటి సినిమా కోసం రెడీ అవ్వడమే కాదు.. రాజకీయంగానూ అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతి చేరుకున్నాడు. ఇక బాలయ్య బోయపాటి సినిమా కోసం 15 కేజీల బరువు తగ్గినట్లుగా సమాచారం.

అయితే బోయపాటి సినిమాలో బాలయ్య లుక్, ఆయన పాత్రపై బాలయ్య అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. తాజాగా బాలకృష్ణ గుండు లో కనబడి ఫాన్స్ కి షాకిచ్చాడు. కాస్త బరువు తగ్గి స్లిమ్ గా తయారైన బాలకృష్ణ బోయపాటి సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేసి గుండు చేయించుకున్నాడో.. లేదంటే తిరుపతి వెళ్లి గుండు చేయించుకున్నాడో తెలియదు కానీ.. ప్రస్తుతం బాలకృష్ణ గుండు లుక్ చూసిన వారు మాత్రం ఇది బోయపాటి సినిమాలోని పవర్ ఫుల్ పాత్ర కోసమే బాలకృష్ణ గుండు చేయించుకున్నాడని ఫిక్స్ అవుతున్నారు. పై నుండి కిందకి వైట్ అండ్ వైట్ ఖాదీ బట్టల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య లుక్ అదిరిపోయింది అంటూ ఫాన్స్ ఈ న్యూ లుక్ ఫోటో ని సోషల్ మీడియాలో వైల్ చేసిపడేస్తున్నారు.

Tags:    

Similar News