బాలయ్య ని పొగుడుతూ మెగా కం బ్యాక్ పై ఆగని వర్మ ట్వీట్స్

Update: 2017-01-13 08:34 GMT

మెగా స్టార్ చిరంజీవి తన 150 వ చిత్రానికి తాను సిద్దమవుతున్నానని ప్రకటించి దాదాపు రెండు సంవత్సరాలుగా ఇప్పుడు అప్పుడు అంటూ ఊరించి అనేక కథలు విని, కొన్నిటిని తిరస్కరించి, కొన్నిటిని పరిశీలనలో ఉంచి చివరికి తమిళంలో విజయం సాధించిన మురగదాస్ కత్తి చిత్ర కథను కొని తెచ్చుకోవటం పై పలువురు ప్రముఖులు, ప్రేక్షకులలో కొంతమంది నిరుత్సాహం చెందినప్పటికీ బయటపడిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అయితే ఆయన చిరు 150 వ చిత్రంగా రీమేక్ ని ఎంచుకోవటాన్ని ఒక ట్వీట్ తో అభిప్రాయం తెలిపి వదలకుండా వరుసగా మెగా ఫామిలీని, మెగా అభిమానులని హేళన చేస్తూ, నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రంగా చారిత్రాత్మక కథని ఎంచుకుని తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తుండటం చూసి మెగా స్టార్ అభిమానులు, బాలయ్య అభిమానులను చూసి సినిమా పట్ల అభిరుచిని పెంచుకోవాలని మెగా అభిమానులకి పదే పదే సూచిస్తూ పలు ట్వీట్స్ చేసాడు వర్మ. ఈ ట్వీట్స్ కి స్పందనగా మెగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక పై మెగా బ్రదర్ నాగ బాబు అగ్రెస్సివ్ గా వర్మ పై విరుచుకు పడ్డారు. నాటి నుంచి కొద్దిగా మౌనం గా వున్న వర్మ 11 న ఖైదీ నెం.150 హడావుడిని చూస్తూ టైం పాస్ చేసి 12 న గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల అనంతరం తిరిగి తన శైలి లో ట్వీట్లు చేసి మెగా కం బ్యాక్ ని మరో సారి నీచమైన పరిణామం గా అభివర్ణించాడు. వర్మ బాలయ్య 100 వ చిత్రాన్ని పొగుడుతూ చిరు 150 వ చిత్రం పై చేసిన ట్వీట్స్ మీరే చూడండి.

"With Borrowed Story one film took telugu cinema 10 years back and GPSK took it 10 years forward with a 2000 year old original story

What Bahubali started GPSK is taking telugu cinema way more forward and even now if Mega people don't realise they might become Mini

Balayya in his 100th film only seems to have become 150 times more Mega advanced in terms of great cinema #GPSK

Salute to @DirKrish n Balayya for pushing telugu cinema pride to skies with original content instead of bringing down with borrowed content

Hey @DirKrish Am supremely thrilled to hear my judgement went so right ..Congrats on the roaring talk of #GPSK ..100 Cheers to u nd Balayya"

Similar News