బాలయ్య కూడా ఆ జాబితాలో చేరినట్టే!

Update: 2016-10-24 07:33 GMT

బాలకృష్ణ 100 చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి 'గౌతమీ పుత్ర...' చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది. ఇక ఇప్పటినుండి ఈ చితం పై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే టీజర్ తో ఈ చిత్రం భారీ అంచనాలు పెంచేలా చేసింది. అయితే రిలీజ్ కి ఇంకా 3 నెలలే ఉండడం తో ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది... రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుందని అంటున్నారు.

ఈ చిత్ర నైజాం హక్కులని హీరో నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డి 11 కోట్లకి చేజిక్కించుకోగా ఎస్. పిక్చర్స్ అధినేత సుధాకర్ గుంటూరు హక్కులని సుమారు 4.50 దక్కించుకున్నారన్నది టాక్. ఇక కృష్ణా హక్కులను బేకరీ ప్రసాద్ అనే వ్యక్తి 3.6 కోట్లకు, 9 కోట్లకు సీడెడ్ రైట్స్ సాయి కొర్రపాటి దక్కించుకున్నారని సమాచారం. అలాగే నెల్లూరు హక్కులని భరత్ 1.98 కోట్లకు దక్కించుకున్నారట. ఇక గౌతమిపుత్రకి సాటిలైట్ ద్వారా కూడా మంచి అమౌంట్ వచ్చిందని వినికిడి. మాటీవీ తొమ్మిది కోట్లకు శాటిలైట్ రైట్స్ , 9 పీఎం ఎంటర్ టైన్ మెంట్స్ 8 కోట్లకు ఓవర్సీస్ డిస్ట్రి బ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాయని తెలిసింది.

మరి ఈ బిజినెస్ ద్వారా నందమూరి బాలకృష్ణ కూడా 60 కోట్ల క్లబ్బులో చేరుతాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు బాలకృష్ణ ఆ మార్క్ ని అందుకోలేదు. మరి 100 వ చిత్రం తో బాలయ్య మరవలేని బహుమతిని ఈ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ద్వారా అందుకోనున్నాడన్నమాట.

Similar News