బాలయ్య... ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా?

Update: 2018-03-25 08:19 GMT

బాలకృష్ణ మామూలుడు కాదు బాబోయ్. సైలెంట్ గా తన పనులు చేసుకుపోతూ అందరికి షాకుల మీద షాకులిచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బయో పిక్ ని రేపో మాపో పట్టాలెక్కించబోతున్న బాలకృష్ణ బోయపాటి తో సినిమా అంటున్నారు. బోయపాటితో కలిసి 2019 ఎన్నికల సమయానికల్లా ఒక సినిమా చేయాలనుకోవడం.... బోయపాటి ఆ సినిమా చాలా క్లారిటీగా ఉన్నాడు. మరో పక్క కన్నడలో హిట్ అయిన మఫ్టీ సినిమాని తెలుగులో బాలకృష్ణ రీమేకేచేస్తాడనే ప్రచారం ఉంది. మరి రెండు మూడు సినిమాలు లైన్ లో ఉంచిన బాలకృష్ణ తాజాగా వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాణంలో మరో మూవీ కి ఒకే చేసాడు.

ఈ సినిమా మే 27 న ఓపెనింగ్ కూడా జరుపుకోబోతుంది. ఇది పక్కా.. ఎందుకంటే ఈ సినిమాని నిర్మించబోయే సి కళ్యాణ్ ఈ విషయాన్నీ ప్రకటించాడు. మరి బాలయ్య జోరు మాములుగా లేదు గాని... అసలు ఇలా ఒక అట్టర్ ప్లాప్ డైరెక్టర్ వి వి వినాయక్ కి ఇపుడు బాలయ్య అవకాశం ఇవ్వడం ఏమిటంటూ ఫిలింనగర్ లో గుసగుసలు. ఎందుకంటే వినాయక్ తాజా గా సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ఇంటిలిజెంట్ ఫలితం ఎలా ఉందొ తెలిసాక కూడా బాలయ్య ఇలా వినాయక్ కి అవకాశం ఇవ్వడం ఏమిటి అంటున్నారు బాలయ్య ఫాన్స్. మరి బాలయ్యకి ఇలా ప్లాప్ దర్శకులకి అవకాశం ఇవ్వడం కొత్తేమి కాదు.

ఇంతకుముందు పైసా వసూల్ తో పూరి జగన్నాద్ కి, జై సింహ తో రవికుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వినాయక్ కి మరి.. బాలయ్యకి వినాయక్ చెప్పిన కథ అంతలా నచ్చిందా... అసలు వినాయక్ ట్రాక్ రికార్డు ఈమధ్య అస్సలేం బాగోలేదు. మరి బాలకృష్ణ మాత్రం అదేమీ పట్టించుకోకున్నా ఇలా వినాయక్ కి అవకాశం ఇచ్చేసాడు. మరి నిజంగా ఇది వినాయక్ అదృష్టమని చెప్పాలి. ఇంటిలిజెంట్ సినిమాతో కొత్తగా ట్రై చెయ్యకుండా ఇంకా పాతకాలపు సినిమాలాంటి సినిమాని తెరకెక్కించాడని తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు వినాయక్. ఇలాంటి టైం లో బాలయ్యతో వినాయక్ సినిమా అంటే వినాయక్ కి కలిసొచ్చే అంశమే.

Similar News